గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పెరుగుతుంది. దీంతో ధవళేశ్వరం వద్ద గోదావరి నది 9. 5 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ధవళేశ్వరానికి సుమారు 10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాజమండ్రి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న నేపథ్యంలో Godavariకి వరద పోటెత్తుతుంది. దీంతో ధవళేశ్వరం వద్ద గోదావరి నది 9.5 అడుగులకు చేరింది. ప్రస్తుతం Dowleswaram Barrage నుండి ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో ధవళేశ్వరం వద్ద పది లక్షల క్యూసెక్కులకు వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత 100 ఏళ్లలో రాని వరదలు జూలై మాసంలో రావడంతో గోదావరి నది కి వరద పోటెత్తింది. .జూలై మాసంలో గోదావరి నదికి వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
undefined
ఈ ఏడాది జూలై 19న గోదావరికి వరద ప్రవాహం తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంంహరించారు. ధవళేశ్వరం నుండి సుమారు 23 నుండి 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేశారు. మరో సారి గోదావరికి వరద పెరుగుతుండడంతో పరివాహక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
గత మాసంలో వచ్చిన వరదల కారణంగా చేరిన బురదను క్లీన్ చేసే పనిలోనే ముంపు ప్రాంత ప్రజలున్నారు. కానీ మరోసారి గోదావరికి వరద పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 1986 తర్వాత గోదావరికి ఇంత స్థాయిలో వరద రాలేదని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత జూలై 19వ తేదీ తర్వాత కురిసిన వర్షాలతో మరోసారి భారీ వర్షాలు కురవడంతో జూలై 26న ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆ తర్వాత గోదావరికి వరద తగ్గింది. కానీ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మరోసారి గోదావరికి వరద ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం వద్ద వరద పోటెత్తుతుంది.
గత మాసంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీలోని గోదావరి పరివాహక ప్రాంతంలోని సుమారు 550కి గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరో వైపు వరద పెరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో అధికారులు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
గత మాసంలో గోదావరికి వరద వచ్చిన స.మయంలో ముంపు గ్రామాల్లో సహాయక చర్యల కోసం మొత్తం 10 NDRF, 11 SDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులతో పాటు ఇతర అత్యవసర సరుకులను పడవల ద్వారా అందించారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబునాయుడులు పర్యటించారు.
మరోవైపు తెలంగాణలోని భద్రాచలంతో పాటు పరివాహక ప్రాంతాల్లో గోదావరి వరద నీరు ముంచెత్తింది. కరకట్ట నిర్మాణంతో భద్రాచలం పట్టణంలో గోదావరి వరద నీరు ముంచెత్తకుండా రక్షించిన పరిస్థితి నెలకొంది. భద్రాచలానికి సమీపంలోని ఐదు విలీన గ్రామాలను తెలంగాణలో కలపాలని కూడా ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు . ఈ ఐదు గ్రామాలు తెలంగాణలో విలీనం చేస్తే కరకట్ట నిర్మాణానికి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయంతో తెలంగాణ వాసులున్నారు.