Andhra Pradesh Exit Polls Result 2024 : ఆరా సర్వేలో వైసిపికే ఆధిక్యం... ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే...

Published : Jun 01, 2024, 09:27 PM IST
Andhra Pradesh Exit Polls Result 2024 : ఆరా సర్వేలో వైసిపికే ఆధిక్యం... ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే...

సారాంశం

గత అసెంబ్లీ ఎన్నికతో పోలిస్తే వైసిపికి సీట్లు తగ్గినా మళ్ళీ అధికారంలోోకి వస్తుందని ఆరా సంస్థ సర్వేలో తేలింది. టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడినా జగన్ ను ఓడించలేకపోతున్నాయని ఈ సర్వే పలితాలు చెబుతున్నాయి. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసిపి మరోసారి విజయం సాధించే అవకాశాలున్నాయని ఆరా సర్వే తేల్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజాభిమానాన్ని పొందాడని... అందువల్లే వైసిపికి 94 నుండి 104 సీట్లు వచ్చే అవకాశం వుందని తేల్చింది.  ఇక టిడిపి, జనసేన, బిజెపి కూటమి గట్టి ఫైట్ ఇచ్చినా కేవలం 71-81 స్థానాలకే పరిమితం కావచ్చని తెలిపింది. ఓట్ల పరంగా చూసుకుంటే వైసిపికి 49 శాతం, టిడిపి కూటమికి 47 శాతం ఓట్ షేర్ వస్తుందని ఆరా సర్వే తేల్చింది. 

ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. మొత్తం ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరిగితే నాలుగో విడతలో ఏపీ ఎన్నికలు జరిగాయి. మే 13న రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగు దేశం-జనసేన-బిజెపి  కూటమి మధ్య ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగింది.  

ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో రికార్డుస్థాయిలో ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. పల్లెలతో పాటు పట్టణ ఓటర్లు కూడా పోలింగ్ బూత్ కు కదలి రావడంతో అర్థరాత్రి వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. దీంతో ఏకంగా 81.86 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇలా ఓటేయడానికి ప్రజలు పోటెత్తడం ఎవరికి లాభిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో పీపుల్స్ పల్స్ సర్వే టిడిపి కూటమికే విజయావకాశాలు ఎక్కువని తేల్చింది. 

అయితే ఏపీలో పోలింగ్ ముగిసిన నాటినుండి ఫలితాలపై చర్చ మొదలైంది. తమ పార్టీదే గెలుపంటే తమదే గెలుపని అటు వైసిపి, ఇటు టిడిపి కూటమి నాయకులు చెబుతున్నారు. ప్రజలు కూడా ఎవరి పక్షాన నిలిచారో అంతుచిక్కడం లేదు. దీంతో ఇవాళ తుది దశ లోక్ సభ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి.  వీటిని తెలుగు ప్రజలే కాదు అభ్యర్థులు, పార్టీ పెద్దలు ఆసక్తిగా గమనిస్తున్నారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సీఎం విజయ్ పై పవన్ పంచ్ లు పడిపడి నవ్విన జన సైనికులు | Deputy CM Pawan Kalyan| Asianet News Telugu
Pawan Kalyan Fun: నన్ను తిట్టిన యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి: పవన్ జోకులు| Asianet News Telugu