నన్ను విమర్శించే అర్హత నీకుందా, ఒక్కసారైనా గెలిచావా: సజ్జలకు చంద్రబాబు కౌంటర్

Siva Kodati |  
Published : Feb 26, 2021, 10:23 PM ISTUpdated : Feb 26, 2021, 10:24 PM IST
నన్ను విమర్శించే అర్హత నీకుందా, ఒక్కసారైనా గెలిచావా: సజ్జలకు చంద్రబాబు కౌంటర్

సారాంశం

తనపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన విమర్శలకు కౌంటరిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కుప్పం పర్యటనలో వున్న ఆయన సజ్జల నన్ను విమర్శించేంతటి వాడా? అంటూ ప్రశ్నించారు.

తనపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన విమర్శలకు కౌంటరిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కుప్పం పర్యటనలో వున్న ఆయన సజ్జల నన్ను విమర్శించేంతటి వాడా? అంటూ ప్రశ్నించారు.

తనను విమర్శించేందుకు ఆయనకున్న అర్హత ఏంటంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సజ్జల ఏనాడైనా ఎన్నికల్లో నిలిచి గెలిచాడా అని నిలదీశారు. తాను ఇప్పటివరకు మాట తూలింది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

తనకు ప్రజాబలం ఉందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం అస్తవ్యస్తంగా మారుతోందని, రాష్ట్రాన్ని స్వాహా చేయాలని కంకణం కట్టుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ ఒక డ్రామారాయుడు అంటూ సెటైర్లు వేశారు.

విశాఖ ఉక్కు పోయిందని, సీఎం జగన్‌కు సెంటిమెంట్‌ అంటే తెలియదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం కుక్కలు చంపిన విస్తర అవుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రౌడీరాజ్యం, అరాచకపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాను ఎందుకు సాధించలేదన్న ఆయన.. యువత భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్