ఆనందయ్యకు జగన్ సర్కార్ బెదిరింపులు... మందుపై అధ్యయనం జరగాల్సిందే : చంద్రబాబు

Siva Kodati |  
Published : May 22, 2021, 02:53 PM IST
ఆనందయ్యకు జగన్ సర్కార్ బెదిరింపులు... మందుపై అధ్యయనం జరగాల్సిందే : చంద్రబాబు

సారాంశం

ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు గురిచేసిందని ఆరోపించారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయుర్వేద మందుపై ప్రభుత్వం అధ్యయనం చేయాలని కానీ ప్రభుత్వం ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయకుండా తక్షణమే నిలిపివేయాలని ఆదేశించిందని మండిపడ్డారు

ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు గురిచేసిందని ఆరోపించారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయుర్వేద మందుపై ప్రభుత్వం అధ్యయనం చేయాలని కానీ ప్రభుత్వం ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయకుండా తక్షణమే నిలిపివేయాలని ఆదేశించిందని మండిపడ్డారు.

వైసీపీ ఎమ్మెల్యే కాకాణి పిలుపుతో కృష్ణపట్నంలో ప్రజలు గుమిగూడారని చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీలో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోందని... ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతున్నారని ప్రతిపక్షనేత ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని పట్టించుకోవాల్సిన సీఎం జగన్.. కక్షసాధింపులకే పరిమితమయ్యారని చంద్రబాబు ఆరోపించారు.

కరోనాకు తోడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా రాష్ట్రంలో ఎక్కువగా నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను వేధించి చంపేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే ఎదురు దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

Also Read:వైసిపి పెద్దల కుట్ర... అడ్డుకోడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమే: చంద్రబాబు

నిబంధనలు ఉల్లంఘించిన అన్ని అంశాలపై కోర్టుల్లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయని చంద్రబాబు గుర్తుచేశారు. కొత్త ఎస్ఈసీని తీసుకువచ్చి ఆగమేఘాల మీద ఎన్నికలు నిర్వహించారని..  సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించకుండా పరిషత్ ఎన్నికలను జరిపారని ఆయన మండిపడ్డారు.

నామినేషన్లు పక్కగా ఉన్నవాళ్లవి కూడా తిరిస్కరించారని... జగన్ అహంభావంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. కోర్టుల ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం కాదు.. అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు.

ఎంపీ రఘురామకృష్ణరాజుపై దేశద్రోహం కేసు పెట్టారని ... గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు రావా? అని చంద్రబాబు నిలదీశారు. రఘురామను హింసించడం బాధాకరమని... ఎంపీని పోలీసులు వేధించారని సుప్రీంకోర్టులో తేలిందని ప్రతిపక్షనేత గుర్తుచేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Reviews GSDP, RTGS & Pattadar Passbooks at AP Secretariat | Asianet News Telugu
Manchu Family Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మంచు ఫ్యామిలీ | Asianet News Telugu