నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది: చంద్రబాబు సంచలనం

తనను ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని  టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు  వ్యాఖ్యానించారు
 

Google News Follow Us

అనంతపురం:తనను ఒకటి రెండు రోజుల్లో  అరెస్ట్ చేసే అవకాశం ఉందని టీడీపీ చీఫ్ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.బుధవారంనాడు అనంతపురంలో చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు బయటకు రాకుండా చేస్తున్నారన్నారు. తనపై కూడ  దాడులు చేస్తున్నారన్నారు.తమ పార్టీ శ్రేణులపై  రౌడీలతో దాడులు చేయిస్తున్నారని ఆయన  వైసీపీపై మండిపడ్డారు.తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు.

వ్యవస్థలను అడ్డు పెట్టుకొని అరాచకాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్ని అచాకాలు చేసినా నిప్పులా బతికానని ఆయన  గుర్తు చేశారు.ఎన్నికేసులు వేసినా ెవరూ ఏమీ నిరూపించలేకపోయారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాలుగేళ్లుగా వైసీపీ అరాచకాలు చేస్తుందన్నారు. ఏదో కంపెనీనీ తెచ్చి తన పేరు చెప్పించాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.డబ్బులు కూడ ఇస్తామని ఆశచూపుతున్నారన్నారని ఆయన చెప్పారు.ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్, రాజధాని, అమరావతి ల్యాండ్స్ లలో అవినీతికి పాల్పడినట్టుగా తనపై  వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను చంద్రబాబు ప్రస్తావించారు.హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో కూైడ అవినీతి అని తనపై ఆరోపణలు చేశారన్నారు.ఇప్పుడు ఇన్ కమ్ ట్యాక్స్ అంటున్నారని బాబు వివరించారు. ఇంతవరకు  తనపై ఒక్క కేసును కూడ రుజువు చేయలేదన్నారు. ఎందుకంటే సాక్ష్యాలు లేవని చంద్రబాబు తెలిపారు. నాలుగున్నర ఏళ్లుగా  తనను ఇబ్బంది పెడుతున్నారన్నారు.

గతంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో  26 విచారణ కమిటీలు ఏర్పాటు చేసినా ఏం చేయలేకపోయారని చంద్రబాబు గుర్తు చేశారు.తనను ఒకటి రెండురోజుల్లో అరెస్ట్ చేస్తారని చంద్రబాబు  చేసిన వ్యాఖ్యలు  ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.  ముందస్తు ఎన్నికలు వస్తే నాలుగు నెలలు, లేకపోతే ఆరు నెలల్లో  వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమ గీతం పాడుతారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎప్పుడో  డిసైడయ్యారని ఆయన  చెప్పారు.

also read:ఎవరెవరి వద్ద ఎంత కమిషన్ తీసుకున్నారో బయటకు వస్తుంది: బాబుకు ఐటీ నోటీసులపై కాకాని

ఇటీవల కాలంలో  ఐటీ శాఖ నుండి చంద్రబాబుకు  షోకాజ్ నోటీసులు వచ్చినట్టుగా  హిందూస్థాన్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురింది. ఈ కథనం ఆధారంగా  చంద్రబాబుపై వైసీపీ విమర్శలు చేస్తుంది. కాంట్రాక్టర్ల నుండి చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని  వైసీపీ  ఆరోపణలు చేస్తుంది.