కారణమిదీ: లోకేష్‌కు భీమవరం పోలీసుల నోటీసులు

By narsimha lode  |  First Published Sep 6, 2023, 1:02 PM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు  భీమవరం పోలీసులు  ఇవాళ నోటీసులు జారీ చేశారు.
 



ఏలూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు  బుధవారంనాడు భీమవరం పోలీసులు  నోటీసులు ఇచ్చారు. భీమవరంలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారని  పోలీసులు నోటీసులు ఇచ్చారు.గతంలో కూడ లోకేష్ కు  పోలీసులు ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో  లోకేష్ పాదయాత్ర సమయంలో  పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో  లోకేష్ పాదయాత్ర నిర్వహించిన సమయంలో  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని  లోకేష్ కు  పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఈ ఏడాది ఆగస్టు  24న  లోకేష్ కు  నోటీసులు అందించారు. గన్నవరం నియోజకవర్గానికి లోకేష్ పాదయాత్ర చేరిన సమయంలో  నిర్వహించిన సభలో  మాజీ మంత్రి కొడాలి నాని,  ఎమ్మెల్యే వల్లభనేని వంశీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు  లోకేష్ పై ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు నోటీసులు అందించారు. 

Latest Videos

undefined

భీమవరంలో తాను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఇచ్చిన నోటీసులపై  లోకేష్ స్పందించారు. పోలీసులు  సూచించిన రూట్ లోనే తన యాత్ర సాగుతుందన్నారు.  భీమవరంలో పోలీసుల ముందే  వైసీపీ నేతలు  రెచ్చగొట్టేలా వ్యవహరించారని లోకేష్ పేర్కొన్నారు. అయినా కూడ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.  తమ పార్టీ కార్యకర్తలపై  వైసీపీ శ్రేణులు దాడులకు దిగినా కూడ  పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని లోకేష్ ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా  జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని  లోకేష్ చెప్పారు.  రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మేరకు  తాను నడుచుకుంటున్నట్టుగా లోకేష్ తెలిపారు. తన యాత్రను ఎక్కడికక్కడ అడ్డుకొనేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని  లోకేష్ ఆరోపించారు. అయినా కూడ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని  ఆయన ఆరోపణలు చేశారు. తమ పార్టీ శ్రేణులపై దాడులకు దిగిన వారిపై చర్యలు తీసుకొన్నారా అని లోకేష్ పోలీసులను ప్రశ్నించారు.

తనను కించపర్చేలా  వైసీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే ఏం చర్యలు తీసుకున్నారని ఆయన అడిగారు. అధికారంలో ఉన్నామని  పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమంగా కేసులు పెడుతున్నారని  వైసీపీపై లోకేష్ విమర్శలు చేశారు.  అధికార పార్టీకి తొత్తులుగా  పనిచేస్తున్న  అధికారుల  చిట్టా తయారు చేస్తున్నామని లోకేష్ చెప్పారు. 

 

 

 

click me!