కేంద్రం ఆహ్వానం.. ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి చంద్రబాబు నాయుడు..

Published : Aug 01, 2022, 01:22 PM IST
కేంద్రం ఆహ్వానం.. ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి చంద్రబాబు నాయుడు..

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్‌లో చంద్రబాబు పాల్గొననున్నారు. వివరాలు.. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఆజాదీ కా అమృత్ ఉత్సవాలకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అధినేతలను కేంద్రం ఆహ్వానించింది. 

ఈ మేరకు కేంద్రం నుంచి ఆహ్వానం అందుకున్న చంద్రబాబు.. ఈ నెల 6వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ  అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!