MLA RK Roja: "మళ్ళీ చంద్రబాబు సీఎం అయితే.. రాష్ట్రాన్ని అమ్మేస్తాడు": మంత్రి రోజా సన్సెష‌న‌ల్ కామెంట్స్

Published : Aug 01, 2022, 01:08 PM IST
MLA RK Roja: "మళ్ళీ చంద్రబాబు సీఎం అయితే.. రాష్ట్రాన్ని అమ్మేస్తాడు": మంత్రి రోజా సన్సెష‌న‌ల్ కామెంట్స్

సారాంశం

MLA RK Roja: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంను జిల్లా చేస్తానని చెప్పడం హాస్యాస్ప‌దంగా ఉంద‌నీ, ఆయ‌న మ‌ళ్లీ సీఎం అయితే.. రాష్ట్రాన్ని అమ్మెస్తాడని విమ‌ర్శించింది.  

MLA RK Roja: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో పుట్టిన త‌న‌కు శ్రీనివాసుడి ఆశీస్సులతో మంత్రిగా అవకాశం దక్కిందనీ అన్నారు. జగనన్న ఆశీస్సులుతో రెండు సార్లు గెలిచి, ప్రజల్లో ఉండి వారి కష్టాలు తెలుసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాన‌ని తెలిపారు.  సీఎం జ‌గ‌న్ రాష్ట్రమంతా పర్యటించి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నార‌ని తెలిపారు. జగన్న కోరుకున్న విధంగా రాష్ట్రాన్ని‌ పరుగులు తీయించాలని స్వామి వారిని కోరాన‌నీ తెలిపారు. 

టీడీపీ అధినేత‌ చంద్రబాబు వరద రాజకీయాలు చేస్తున్నారని విమ‌ర్శించారు. 14 ఏళ్ల పాటు రాష్ట్ర‌ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను మున్సిపాలిటీగా మార్చ‌లేక‌పోయార‌ని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును తాను అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఏటీఎం కార్డులా వాడుకున్నారని రోజా ఘాటు విమర్శలు చేశారు. 

అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం గురించి ఏ రోజు ప‌ట్టించుకోలేద‌నీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేద‌ని విమ‌ర్శించారు. చంద్రబాబు .. రాష్ట్రాన్ని అప్పుల్లో‌ ముంచి, ఆ పార్టీ నాయకులు ప్రజల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసారని ఆరోపించారు. జగన్న త‌న పాదయాత్రలో వాగ్దానం చేసిన విధంగా.. ఇచ్చిన‌ మాట త‌ప్ప‌కుండా హామీలు నేరవేస్తున్నార‌ని తెలిపారు. ఎన్ని అవరోధాలు, కష్టాలు ఎదురైనా పేదవారి సంక్షేమమే ప్రధ‌మ ధ్యేయంగా జగన్న పని చేస్తున్నారని వివ‌రించారు.

గోదావరి వరదల్లో ప్రజలందరికీ రెండు వేల రూపాయలు అందించామని, ప్రజలందరికి వాలంటీర్ల ద్వారా రేషన్, పాలు, కావాల్సిన వసతులు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.  సీఎం జ‌గ‌న్ అపత్కాలంలో దేవుడిలా ప్రజల వద్దకు వెళ్లిన ఆదుకున్నారనీ, వారిని అక్కున చేర్చుకుని తమ అభిమానం చూపారని అన్నారు. చంద్రబాబుకి పేటిఎం బ్యాచ్ తో భజనలు చేయించుకోవడం అలవాటు ఉండ‌నీ, గతంలో కూడా చూసామ‌ని ఎద్దేవా చేశారు. 
 
పోలవరం కట్టకుండానే బస్సు వేసి రాష్ట్ర నలుమూలల నుండి టిడిపి నాయకులను తీసుకెళ్ళి జయము జయము చంద్రన్న అంటూ భజన చేయించారనీ, పోలవరం నిర్మాణం చేప‌డుతున్న సీఎం జగన్ ను  కట్టడం చేత కాదు.. దిగి పోమ్మనండీ అంటున్నార‌ని విమ‌ర్శించారు. 

చంద్రబాబు ఇంత వరకూ సీఎం కాలేదని అనుకుంటున్నాడేమో.. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు పోలవరంను కట్టకుండా గాడిదలు కాస్తున్నావా? చంద్రబాబు అని ప్ర‌శ్నించారు. రాష్ట్రం విభజన తరువాత కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు పోలవరంను పూర్తి చేయలేక చేతగానీ తనంను ప్రదర్శించారని తెలిపారు.

డబ్బుల పిచ్చితో కేంద్రం ఇచ్చిన ఓ ప్యాకేజీని తన స్వలాభం కోసం పోలవరంను ఓ ఏటిఏం కార్డులాగా వాడుకున్నార‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. చంద్రబాబును సీఎం చేసిన పాపానికి రాష్ట్ర ప్రజలు నష్ట పోతున్నారని విమ‌ర్శంచారు. ఆర్ అండ్ ఫ్యాకేజీ రావాల్సిన మండలాలు అన్ని ఇబ్బంది పడుతున్నాయ‌నీ.. ఆ పాపం చంద్ర‌బాబుదే అని అన్నారు.  జగన్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 20 వేల కోట్లు ఉన్న ఆర్ అండ్ ప్యాకేజీ కోసం విన్నపాలు తెలియజేస్తున్నారని తెలిపారు.

తాను ముఖ్యమంత్రి అయితే.. ముప్పు మండలాలు అన్ని ఓ జిల్లాగా చేస్తాను అని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉంద‌ని మంత్రి రోజా అన్నారు. కుప్పంను మున్సిపాలిటీ చేసుకోలేక పోయావు, రెవెన్యూ డివిజన్ చేసుకోలేక పోయావని, మళ్ళీ చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రాన్ని అమ్మెస్తాడని ఆర్.కే.రోజా
విమ‌ర్శించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!