ఈ నెల 4 నుండి టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 4 నుండి ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనతో చంద్రబాబు జిల్లాల టూర్ ని ప్రారంభించనున్నారు.
అమరావతి: TDP చీఫ్ Chandrababu Naidu రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటనలు చేయాలని భావిస్తున్నారు. ఈ నెలాఖరున జరిగే మహానాడు నాటికి రాష్ట్రంలె మెజారిటీ District పర్యటనలు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి చంద్రబాబు తన టూర్ ను ప్రారంభించనున్నారు.
గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ ఘోరంగా దెబ్బతింది. ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపీకి గతంలో పెట్టని కోటగా ఉండేవి. అయితే గత ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు దక్కించుకొంది. జగన్ సర్కార్ ఇటీవల కాలంలో Electricity చార్జీలు, RTC బస్సు చార్జీలను పెంచింది. వీటితో పాటు పలు రకాల చార్జీలను పెంచింది. దీంతో చార్జీల పెంపును నిరసిస్తూ బాదుడే బాదుడు అంటూ టీడీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
undefined
ఈ నెల 4న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో జరిగే నిరసన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏపీ అసెంబ్లీ స్పీకర్ Tammineni Sitaram ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తమ్మినేని సీతారాం చంద్రబాబుపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తమ్మినేని సీతారాం విమర్శలకు టీడీపీ నేత కూన రవికుమార్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు ఈ నెల 4న ఆముదాలవలసలో పాల్గొంటారు.
ఈ నెల 5న భీమిలి నియోజకవర్గంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి ఆవంతి శ్రీనివాస్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ నియోజకవర్గంలో నిర్వహించే టీడీపీ నిరసన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. మే 6న ముమ్మిడివరం నియోజకవర్గం కోరింగలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు.
ఈ కార్యక్రమాలు పూర్తైన తర్వాత మిగిలిన జిల్లాల్లో కూడా చంద్రబాబు పర్యటించే అవకాశం ఉంది. ఏపీ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ ను క్షేత్ర స్థాయి నుండి ఎన్నికలకు సిద్దం చేయడం కోసం ఈ పర్యటనలు దోహదపడే అవకాశం ఉందని టీడీపీ నాయకత్వం భావిస్తుంది. ఈ ఏడాది మహానాడును ప్రకాశం జిల్లాలో నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. ఒక్క రోజు మాత్రమే మహానాడును నిర్వహిస్తున్నారు. మహానాడు వరకు ఎక్కువ జిల్లాల్లో పర్యటించాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు.
Mahanadu సందర్భంగా కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలను కూడా చంద్రబాబు వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ ఇంచార్జీల విషయమై కూడా చంద్రబాబు ఇటీవల కాలంలో సీరియస్ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారో ఎవరు పనిచేయడం లేదో కూడా మానిటరింగ్ చేస్తున్నట్టుగా చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఉండి పార్టీ కోసం పనిచేసే వారికే పార్టీ పదవులు కానీ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కానీ దక్కుతాయని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా అభ్యర్ధలు ఎంపిక ఉండదని కూడా చంద్రబాబు తేల్చి చెప్పారు.