హత్యలు, అత్యాచార ఘటనల్లో నిందితుల్లో ఎక్కువగా టీడీపీ వారే ఉన్నారని ఏపీ హోం మంత్రి తానేటి వనిత విమర్శించారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో రేపల్లే గ్యాంగ్ రేప్ బాధితురాలిని మంత్రి పరామర్శించారు.
ఒంగోలు: హత్యలు, అత్యాచార ఘటనల్లో నిందితుల్లో ఎక్కువ మంది టీడీపీకి చెందినవారే ఉన్నారని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ఆరోపించారు.
సోమవారం నాడు ఒంగోలు RIMS ఆసుపత్రిలో Repalle గ్యాంగ్ రేప్ బాధితురాలిని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి Taneti Vanitha పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని డాక్లర్లను అడిగి తెలుసుకొన్నారు. గ్యాంగ్ రేప్ ఘటనతో బాధితురాలి మానసిక స్థితి దెబ్బతిందని మంత్రి చెప్పారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి వైద్యులను ఆదేశించారు.
TDP నేతల ప్రమేయంతోనే మహిళలపై ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని ఏపీ మంత్రి తానేటి వనిత విమర్శించారు. బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తో పాటు 376 డి, 394 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని మంత్రి వివరించారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
రేపల్లే ఘటనలో నిందితులు ఎవరనే విషయాన్ని చూడకుండా అరెస్ట్ చేశామని ఏపీ మంత్రి Adimulapu Suresh,చెప్పారు. మంత్రి వనితతో కలిసి ఆయన కూడా బాధితురాలిని పరామర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయంలో నిందితులను అరెస్ట్ చేసేందుకు చాలా ఆలస్యం చేసేవారని ఆయన ఆరోపించారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా శిక్షకు గురి కావాల్సిందేనని తమ ప్రభుత్వ అభిమతమని కూడా మంత్రి సురేష్ చెప్పారు. బాధితురాలి ఐడెంటిటీని బయటకు చెప్పకుండా ఉండాల్సిన బాధ్యతను పాటించకపోవడంపై విపక్షాలపై మంత్రి సురేష్ మండిపడ్డారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన భార్యాభర్తలు కృష్ణా జిల్లాలోని ఆవనిగడ్డలో కూలీ పనులకు వెళ్లేందుకు గాను రైలులో రేపల్లేకి శనివారం నాడు చేరుకొన్నారు. ఈ జంట రేపల్లే చేరుకొనే సమయానికి రాత్రి అయింది. ఆ సమయంలో ఆవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో రైల్వే స్టేషన్ లోని బల్లపై పడుకున్నారు. అయితే ఆదివారం నాడు తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు వచ్చి బాధితురాలి భర్తను టైం అడిగారు.
వాచీ లేదనడంతో అతడిని కొట్టారు. అతని వద్ద ఉన్న రూ. 750 తీసుకొన్నారు. ఈ సమయంలో భర్తను కొట్టవద్దని బాధితురాలు అడ్డుకొనే ప్రయత్నం చేసింది. ఆమెను కూడా కొట్టారు. రైల్వే స్టేషన్ కు లోనే చాటుకు తీసుకెళ్లి నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రైల్వే స్టేషన్ లో ఎవరూ కూడా బాధితురాలి భర్తకు సహాయం చేయలేదు. దీంతో పక్కనే పోలీస్ స్టేషన్ ఉందని చెప్పడం అక్కడికి అతను వెళ్లాడు. పోలీసులను తీసుకొని వచ్చే సరికే నిందితులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు పోలీస్ వాహనాన్ని చూసి నిందితులు పారిపోయారని పోలీసులు చెప్పారు. ముగ్గురు నిందితులను ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ముగ్గురిలో ఇద్దరు మేజర్లు కాగా, ఒకరు మైనర్ అని ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు.
రైల్వే స్టేషన్ లో దొరికిన ఆధారాల మేరకు పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితుల్లో ఒకరు షర్ట్ మార్చుకొన్నాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు శాస్త్రీయ ఆధారాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.