కుప్పం బాధ్యత కంచర్ల శ్రీకాంత్ దే... టిడిపి చీఫ్ చంద్రబాబు కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Apr 27, 2023, 4:09 PM IST
Highlights

టిడిపికి కంచుకోట కుప్పం నియోకవర్గంలో మరింత సత్తాచాటి భారీ మెజారిటీ సాధించేలా పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను చంద్రబాబు నాయుడు ఇటీవలే ఎమ్మెల్సీగా గెలిచిన కంచర్ల శ్రీకాంత్ కు అప్పగించారు. 

చిత్తూరు : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెతను ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా టిడిపిని బలోపేతం చేసేందుకు చంద్రబాబు పర్యటనలు, ఆయన తనయుడు లోకేష్ పాదయాత్ర చేపట్టారు. ఇలా రాష్ట్రంలో టిడిపిని బలోపేతం చేసే క్రమంలో తన సొంత నియోజకవర్గాల్లో పార్టీ వీక్ కాకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గంలో టిడిపిని మరింత బలోపేతం చేసేందుకు చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 

ఇప్పటికే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే వైసిపి ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. వైసిపి అధికారంలోకి వచ్చాక జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో టిడిపికి కంచుకోటగా చెప్పుకునే కుప్పంలో వైసిపి పాగా వేసింది. సొంత నియోజకవర్గంలో చంద్రబాబును ఓడించి టిడిపిని రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీయాలన్నది వైసిపి ఎత్తుగడగా కనిపిస్తోంది. అయితే ఇది గుర్తించిన చంద్రబాబు ఓవైపు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే పనిలో వుంటూనే మరోవైపు కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 

Latest Videos

కుప్పంలో చంద్రబాబును లక్ష ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా టిడిపి పని ప్రారంభించింది. స్థానిక నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంతో పాటు వివిధ కార్యకలాపాల కోసం టిడిపి ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేసింది. ఇందులో ముఖ్యమైన సమన్వయ కమిటీకి ఛైర్మన్ గా ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన కంచర్ల శ్రీకాంత్ ను నియమించారు. ఇక కుప్పం నియోజకవర్గ ఇంచార్జి మునిరత్నంతో పాటు మొత్తం 34మంది సభ్యులతో కూడిన కమిటీని టిడిపి ఏర్పాటుచేసింది. 

Read More  సొంత బాబాయ్ ని గొడ్డలితో నరికించింది ఈ సైకో సీఎం జగనే : చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కుప్పంలో తిరుగులేని మెజారిటీతో గెలిపించి సత్తా చాటాలని టిడిపి భావిస్తోంది. తద్వారా వై నాట్ కుప్పం అంటూ సొంత నియోజకవర్గంలోనే  చంద్రబాబును ఓడిస్తామంటున్న వైసిపి నాయకులకు మాటలతో కాకుండా భారీ గెలుపుతోనే సమాధానం చెప్పాలని టిడిపి భావిస్తోంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించాలని మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నిస్తున్నారు.ఇందుకు ఆయనకు అడ్డుగా వున్నది కుప్పం నియోజకవర్గం ఒక్కటే. ఇక్కడ టిడిపి ఓడించగలిగితే జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ వైసిపి అడ్డు వుండదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో కుప్పంలో టిడిపి గెలుపును సమర్దవంతంగా అడ్డుకోగలిగారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఫలితాన్ని రాబట్టి చంద్రబాబును ఓడించగలిగితే వైసిపి, తనకు తిరుగుండదని మంత్రి పెద్దిరెడ్డి భావిస్తున్నారు. 

అయితే వైసిపి వ్యూహాలకు తిప్పికొట్టేందుకు చంద్రబాబు కూడా సిద్దమైనట్లు తాజా నిర్ణయం ద్వారా తెలుస్తోంది. తాను స్థానికంగా అందుబాటులో లేకున్నా నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసారు. ఈ కమిటీకి ఇటీవల అధికార వైసిపి ఓడించి ఎమ్మెల్సీగా గెలిచిన కంచర్ల శ్రీకాంత్ ను ఛైర్మన్ ను నియమించారు. ఇలా తన సీటును కాపాడుకోవడమే కాదు వైసిపి ఎత్తులను చిత్తుచేయడమే ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు వెనకున్న రాజకీయ వ్యూహమని టిడిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. 
 

 
  

 
 

click me!