సొంత ఇలాకాలోనే మంత్రి రజనికి షాక్... వైసిపి నాయకుల తిరుగుబడి బహిష్కరణ ప్రకటన

Published : Apr 27, 2023, 02:18 PM ISTUpdated : Apr 27, 2023, 02:21 PM IST
సొంత ఇలాకాలోనే మంత్రి రజనికి షాక్... వైసిపి నాయకుల తిరుగుబడి బహిష్కరణ ప్రకటన

సారాంశం

తమకు సమాచారం ఇవ్వకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న మంత్రి విడదల రజని పాల్గొనే కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు చిలకలూరిపేట వైసిపి నాయకులు ప్రకటించారు. 

చిలకలూరిపేట : ఆంధ్ర ప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనికి సొంత నియోజకవర్గంలో వైసిపి నాయకులే షాక్ ఇచ్చారు. తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామానికి ఎలా వస్తారంటూ మంత్రిని నిలదీసారు. తమను పట్టించుకోకుండా గ్రామ పర్యటనను ఖరారు చేసి ప్రకటించడం ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు మంత్రి పర్యటనను బహిష్కరించనున్నట్లు సంచలన ప్రకటన చేసారు. 

మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రజని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వున్నాయి. దీంతో చిలకలూరిపేట వైసిపి నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇలా తాజాగా నాదెండ్ల మండలం చందవరం గ్రామ వైసిపి అధ్యక్షుడు మంత్రి పర్యటనకు వెళ్ళకుండా బహిష్కరించి నిరసన తెలపనున్నట్లు ప్రకటించాడు.  

Read More  వివేకా కేసు.. అవినాష్ రెడ్డి గురించి జిల్లా అంతా తెలుసు, అరెస్ట్ ఖాయం : టీడీపీ నేత బీటెక్ రవి

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 'మా నమ్మకం నువ్వే జగనన్న' పేరిటి నాయకులు, కార్యకర్తలు ప్రజలవద్దకు వెళ్లే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలోని మంత్రి రజని కూడా తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా చందవరం గ్రామంలో రేపు(శుక్రవారం) ఇంటింటికి వెళ్ళి వైసిపి ప్రభుత్వ సంక్షేమ పథకాల అందుతున్నాయో లేదో తెలుసుకోవాలని నిర్ణయించారు. ఆమె పర్యటన ఖరారైన నేపథ్యంలో స్థానిక వైసిపి నాయకులు తాజాగా షాకిచ్చారు.  

మంత్రి రజిని తమ గ్రామంలో చేపట్టే కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు చందవరం గ్రామ వైసీపీ నాయకులు ప్రకటించారు. గ్రామ అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలకు రేపు(28న) మంత్రి పర్యటన వుంటుందని సమాచారం లేదు... కాబట్టి పార్టీ పెద్దలు,  కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించామని అన్నారు. 

పార్టీ కార్యక్రమం గురించి తమకు సమాచారం లేదని మంత్రిని అడిగితే వస్తే రండి... లేకుంటే లేదు అంటున్నారని వైసిపి నాయకులు వాపోయారు. కాబట్టి ఇలా పార్టీని నష్టపరిచే చర్యలను వెంటనే నిలువరించాలని పల్నాడు జిల్లా పార్టీ పెద్దలను కోరుతున్నట్లు వైసిపి గ్రామాధ్యక్షుడు గొడుగునూరి వెంకటరామిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేసారు. 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్