జగన్ ఎంత బలవంతుడో ఏపీ కేబినెట్ పునర్వవ్యవస్థీకరణతో తేలిపోయిందని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. సోమవారం నాడు ఆయన టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో మాట్లాడారు.
అమరావతి: YCPలోని డొల్లతనం, అసంతృప్తి మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణతో బయట పడిందని టీడీపీ చీఫ్ చంద్రబాబు అభిప్రాయపడ్డారు. TDP స్ట్రాటజీ కమిటీ సమావేశం సోమవారం నాడు జరిగింది.ఈ సమావేశంలో Chandrababunaidu మాట్లాడారు. జగన్ ఎంత బలహీనుడో కేబినెట్ పునర్వవ్యవస్థీకరణతో తేలిందన్నారు.
బ్లాక్ మెయిల్ కి పాల్పడిన వారికే YS Jagan మంత్రి పదవులు ఇచ్చారనే స్వంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రను మూడేళ్లుగా దోచుకున్న Vijayasai Reddy రాయలసీమకు వెళ్లడం కూడా దోచుకోవడం కోసమేనని చంద్రబాబు విమర్శించారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకొనే జగన్ పెన్షన్లను సకాలంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అంధకారంలోకి నెట్టివేయబడ్డారన్నారు. జగన్ ఒక అపరిచితుడన్నారు. సీఎం తీసుకొనే రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్ లో పయనిస్తుందన్నారు. నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం కేసులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. జగన్ ఏదో చేస్తారని భావించిన స్వంత వర్గం కూడా తీవ్ర అసంతృప్తితో ఉందని చంద్రబాబు విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు.11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించారు. 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. తొలుత అంబటి రాంబాబు ప్రమాణం చేశారు. చివరకు విడుదల రజ.ని మంత్రిగా ప్రమాణం చేశారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు.అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పించారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. . మంత్రి పదవి దక్కని అసంతృప్తులను వైసీపి నాయకత్వం చల్లబరిచింది.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి. .సీఎం జగన్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 11న భేటీ అయ్యారు. పార్టీ పదవిని సీఎం అప్పగిస్తారని చెప్పారన్నారు. ఏ బాధ్యత ఇచ్చినా కూడా తాను సమర్ధవంతంగా నిరవహిస్తానని చెప్పారు. ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరితలతో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సమావేశమయ్యారు. ఇద్దరితో చర్చించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ నెల 12 ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత సీఎంతో కూడా ఆయన భేటీ అయ్యారు. పార్టీ బాధ్యతలను తాను నిర్వహిస్తానని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. సామినేని ఉదయభాను కూడా ఈ నెల 12నే నే సీఎంతో భేటీ అయ్యారు. అయితే సీఎం చుట్టూ ఉన్న కోటరీ గురించి కూడా ఉదయభాను సీఎం వద్ద ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న మాజీ హోం మంత్రి సుచరిత సీఎంతో భేటీ అయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు తాను పనిచేస్తానని సుచరిత ప్రకటించారు.