అనకాపల్లిలో దారుణం: సర్‌ప్రైజ్ అంటూ కాబోయే భర్త గొంతు కోసిన యువతి

Published : Apr 18, 2022, 07:47 PM ISTUpdated : Apr 18, 2022, 09:47 PM IST
అనకాపల్లిలో దారుణం: సర్‌ప్రైజ్ అంటూ కాబోయే భర్త గొంతు కోసిన యువతి

సారాంశం

ఉమ్మడి విశాఖ జిల్లాలోని రావికమతంలో పెళ్లి ఇష్టం లేక కాబోయే భర్త గొంతు కోసింది యువతి, తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  

అనకాపల్లి: ఉమ్మడి విశాఖ జిల్లాలోని  Anakapalleకి  సమీపంలో గల Ravikamathamలో  పెళ్లి ఇష్టం లేక కాబోయే భర్త గొంతు కోసింది యువతి.. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో యువకుడి కి చికిత్స అందిస్తున్నారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

రావికమతంలో కాబోయే husbandను సర్ ప్రైజ్ అంటూ కళ్లు మూసుకోవాలని చెప్పి knifeతో యువతి throat కోసింది.  తీవ్రంగా గాయపడిన యువకుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాడేరుకు చెందిన రాము నాయుడికి రావికమతం గ్రామానికి చెందిన యువతికి పెద్దలు ఈ ఏడాది మే 28న వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. వీరిద్దరికి కూడా నిశ్చితార్ధం కూడా చేశారు. Ramu Naidu హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో  పని చేస్తున్నాడు. హైద్రాబాద్ నుండి స్వగ్రామానికి యువకుడు వచ్చాడు. 

ఈ విషయం తెలుసుకున్న యువతి  అతడిని తమ ఇంటికి పిలిపించింది. ఏకాంతంగా మాట్లాడాలని తమ ఇంటికి సమీపంలోని గుట్టపైకి తీసుకెళ్లింది. సర్‌స్రైజ్ అంటూ రాము నాయుడిని కళ్లు మూసుకోవాలని కోరింది. రాము కళ్లు మూసుకోగానే తన వెంట తెచ్చుకొన్న కత్తితో రాము గొంతు కోసింది. దీంతో తీవ్రగా గాయపడిన రాము నాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. యువతిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ పెళ్లి ఇస్టం లేదని చెప్పినా వినకుండా తమ పెద్దలు పెళ్లి చేస్తున్నారని యువతి పోలీసుల విచారణలో చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే యువతికి  ప్రేమ వ్యవహరం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : రుతుపవనాలతో జతకలిసిన ద్రోణి.. ఇక ఈ జిల్లాల్లో వర్షబీభత్సమే, ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే
సామాన్యుడిలా మత్య్సకార కుటుంబాలతో నారా లోకేష్ చిట్ చాట్ | Nara Lokesh Visits Fishermen in Puligadda