పోతిరెడ్డిపాడుపై రాష్ట్రం హక్కును కాపాడాలి, తండ్రి మాదిరిగానే కొడుకు: జగన్ పై బాబు సెటైర్లు

Published : May 20, 2020, 04:56 PM IST
పోతిరెడ్డిపాడుపై రాష్ట్రం హక్కును కాపాడాలి, తండ్రి మాదిరిగానే కొడుకు: జగన్ పై బాబు సెటైర్లు

సారాంశం

పోతిరెడ్డిపాడు విషయంలో రాష్ట్రం హక్కును కాపాడుకొనేలా ప్రభుత్వం వ్యవహరించాలని ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు నాయుడు సూచించారు.

 


అమరావతి: పోతిరెడ్డిపాడు విషయంలో రాష్ట్రం హక్కును కాపాడుకొనేలా ప్రభుత్వం వ్యవహరించాలని ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు నాయుడు సూచించారు.

బుధవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం నుండి నీటి తరలింపు భవిష్యత్తులో రాష్ట్రానికి ఇబ్బందులు తీసుకొస్తోందని తాను గతంలో అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

రాయలసీమలో ప్రాజెక్టులను పూర్తి చేసింది తమ ప్రభుత్వమేనని ఆయన తేల్చి చెప్పారు. జగన్ కు ఎక్కడ ఏ ప్రాజెక్టు ఉందో అసలు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. 

రాష్ట్ర హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నించాలని ఆయన కోరారు. పోతిరెడ్డిపాడు విషయంలో రాష్ట్ర హక్కులకు నష్టం కలగకుండా ప్రభుత్వం తీసుకొనే ఏ చర్యకైనా తమ పార్టీ మద్దతును ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.

also read:ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపితే కేసులు, విద్యుత్ సంస్కరణలకు తూట్లు:జగన్ పై బాబు

ఏపీకి పోలవరం జీవనాడి అయితే రాయలసీమకు ముచ్చుమర్రి ప్రాజెక్టు కేంద్రంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.జగన్ తండ్రి వైఎస్ఆర్ కూడ ఇదే రకంగా వ్యవహరించాడన్నారు. కృష్ణా నదిలో మిగులు జలాలను తాము అడగబోమని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన  రాత పూర్వకంగా లేఖ ఇచ్చాడన్నారు. ఇది తీవ్రంగా నష్టం చేస్తోందని ఆయన చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు