సాక్ష్యాలుంటే జగన్ మమ్మల్ని బతకనిచ్చేవాడా?: సుప్రీం తీర్పుపై బాబు రియాక్షన్

Published : May 03, 2023, 05:03 PM IST
సాక్ష్యాలుంటే జగన్ మమ్మల్ని బతకనిచ్చేవాడా?: సుప్రీం తీర్పుపై బాబు రియాక్షన్

సారాంశం

అమరావతి ల్కాండ్ స్కాంపై  ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ను సుప్రీంకోర్టు ఇవాళ  కొట్టివేసింది.  ఈ విషయమై  చంద్రబాబు స్పందించారు. ఇంతకాలం పాటు  సిట్ విచారించకుండా ఏం చేశారని  ప్రశ్నించారు.   

 అమరావతి ల్యాండ్ స్కాంపై  ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను  సుప్రీంకోర్టు  ఇవాళ  కొట్టివేసింది.  ఈ విషయమై  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్పందించారు.  బుధవారంనాడు  అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  తమ ప్రభుత్వం  ఏం చేసిందో నని  చాలా వెతికారు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. జగన్ షెల్ అకౌంట్లోకే  డబ్బులు వచ్చాయన్నారు.  తాము మేం క్లీన్ గా  ఉన్నామన్నారు. ఈ విషయమై  ఎవరూ ఏమీ చేయలేరని చంద్రబాబు  చెప్పారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లల్లో ఏదో జరిగిందన్నారు.. ఏం చేశారని  ఆయన  ప్రశ్నించారు. నాలుగేళ్లల్లో ఏం చేయలేకపోయారని చంద్రబాబు  తెలిపారు.  ఇప్పుడేం చేయగలరని ఆయన  ప్రశ్నించారు. 

ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్, ఇన్‌సైడర్  ట్రేడింగ్ అంటూ ఆరోపణలు చేసిన విషయాన్ని చంద్రబాబు  ప్రస్తావించారు.  ఏమైనా  దొరికిందా అని  చంద్రబాబు అడిగారు.  సుప్రీం కోర్టు చెప్పిన వెంటనే కేసులు పెడతామంటున్నారన్నారు. 

also read:అమరావతి ల్యాండ్ స్కాంలో అరెస్టులు తప్పవు: బాబు అవినీతిని బయటపెడతామన్న సజ్జల

జగన్ దగ్గర సాక్ష్యాలుంటే మమ్మల్ని బతకనిచ్చేవారా..? చంద్రబాబు  ప్రశ్నించారు.  స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ గ్రిడ్, నారాయణ మీద తప్పుడు కేసులు పెట్టే  విషయంలో సిట్ అడ్డం వచ్చిందా..? అని  అడిగారు.  

రజనీకాంత్ అంటే  ఆయనపై  పడిపోయారని ఆయన  వైసీపీ నేతల తీరును తప్పుబట్టారు. మన్మోహన్ సింగ్, బిల్్ క్లింటన్ కూడా హైద్రాబాద్ అభివృద్దిని పొగిడారని చంద్రబాబు గుర్తు  చేశారు.  కాపులతో తనను  పవన్ కళ్యాణ్ తిట్టిస్తున్నారని చంద్రబాబు  చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: మిమ్మల్ని ఏమైనా అంటే..! కోపాలు తాపాలు... చేసేవి పాపాలు | Asianet Telugu
Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు