అమరావతి లాండ్ స్కాం .. చంద్రబాబు అండ్ కో జైలుకెళ్లడం ఖాయం : రోజా, భువనేశ్వరినీ లాగిన మంత్రి

By Siva KodatiFirst Published May 3, 2023, 4:56 PM IST
Highlights

అమరావతి లాండ్ స్కామ్‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి ఆర్కే రోజా. లోకేష్, చంద్రబాబు ఇచ్చిన సూట్‌ కేసులు లెక్కపెట్టిన భువనేశ్వరి లెక్కలు బయటకు వస్తాయని రోజా తీవ్రవ్యాఖ్యలు చేశారు. 

అమరావతి లాండ్ స్కామ్‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు అండ్ కో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఇన్నాళ్లు చేసిన తప్పులకు స్టేలు తెచ్చుకుంటూ బతికారని.. కానీ చంద్రబాబు పాపాలు పండాయని, జైలుకు వెళ్లి చిప్పకూడు తినే రోజులు వచ్చాయన్నారు. ప్రజల దగ్గర నుంచి కోట్లు దోచుకున్నారని.. రాజధానిలో భూములు కొని ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారని రోజా ఆరోపించారు. సిట్ విచారణలో అన్ని లెక్కలు బయటకు వస్తాయని.. లోకేష్, చంద్రబాబు ఇచ్చిన సూట్‌ కేసులు లెక్కపెట్టిన భువనేశ్వరి లెక్కలు బయటకు వస్తాయని రోజా తీవ్రవ్యాఖ్యలు చేశారు. 

కాగా.. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అమరావతి భూముల కొనుగోళ్లు, లావాదేవీలకు సంబంధించి జరిగిన అవినీతిపై జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై ఏపీ హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్ట్ బుధవారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. 

Latest Videos

ALso Read: అమరావతి ల్యాండ్ స్కాంలో అరెస్టులు తప్పవు: బాబు అవినీతిని బయటపెడతామన్న సజ్జల

అంతకుముందు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అమరావతి పేరుతో చంద్రబాబు సర్కార్   భారీ అవినీతికి పాల్పడిందన్నారు. అమరావతి పేరు చెప్పి దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో  కచ్చితంగా అరెస్టులు జరుగుతాయని సజ్జల జోస్యం చెప్పారు. టీడీపీ హయంలో  జరిగిన  అవినీతిపై  సిట్ ఏర్పాటు చేసినట్టుగా ఆయన  చెప్పారు. రాష్ట్ర సంపదకు నష్టం కల్గించే కుట్రలను  బయటకు తీస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి  తెలిపారు.  విధానపరమైన  నిర్ణయాలతో  రాష్ట్రానికి నష్టం కలిగిస్తే  తప్పేనన్నారు.  సిట్ దర్యాప్తులో  మరిన్న విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. 

గతంలో  జరిగిన తప్పులపై సమీక్ష జరగాల్సిందేనన్నారు. అమరావతి ల్కాండ్ స్కాంపై  సిట్ దర్యాప్తుపై  చంద్రబాబు  ఆయన ముఠా ఎందుకు  భయపడిందని  ఆయన ప్రశ్నించారు. ఈ స్కాంలో తమ పాత్ర లేకపోతే  దర్యాప్తు  కోరవచ్చు కదా అని  చంద్రబాబును  సజ్జల రామకృష్ణారెడ్డి  ప్రశ్నించారు. సిట్ దర్యాప్తుపై స్టే కోరడమంటే  అందులో ఏదో మతలబు ఉన్నట్టేనని ఆయన  అనుమానం వ్యక్తం  చేశారు. అమరావతిలో జరిగిన  అవినీతిని బయటపెడతామన్నారు. దేశంలోనే  భూమికి సంబంధించిన అతి పెద్ద స్కాంగా దీనిని సజ్జల  పేర్కొన్నారు. రియల్ ఏస్టేట్  స్కామ్ కు  రాజధాని అని పేరు పెట్టారని  సజ్జల రామకృష్ణారెడ్డి  ఆరోపించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు హస్తం ఉందన్నారు. 

click me!