కఠారి దంపతుల హత్య : ప్రశ్నిస్తే మీదకి జీపు ఎక్కిస్తారా , పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం.. డీజీపీకి లేఖ

By Siva KodatiFirst Published Jun 25, 2022, 2:56 PM IST
Highlights

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో కఠారి అనూరాధ దంపతుల హత్యపై విచారణ వేగంగా జరిపి, బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 

తెలుగుదేశం పార్టీ అధికారంలో వుండగా.. ఏడేళ్ల కిందట చిత్తూరులో మాజీ మేయర్ కఠారి అనురాధ, కఠారి మోహన్ దంపతులు దారుణ హత్యకు గురికావడం అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ హత్య కేసు విచారణలో జాప్యం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (chandrababu naidu) శనివారం ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి (ap dgp rajendranath reddy) లేఖ రాశారు. జాప్యం లేకుండా నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని, అయితే బాధితుల వినతిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు సాక్షులను బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండడం సరికాదని ఆయన హితవు పలికారు. 

అటు, మాజీ మేయర్ కఠారి హేమలత విషయంలోనూ పోలీసుల వైఖరిని చంద్రబాబు ఎండగట్టారు. పోలీసు చర్యలను నిరసించిందన్న కారణంగా హేమలతపై పోలీసు జీపు ఎక్కించారని, ఇప్పుడు ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉందని టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, హేమలత గాయపడడానికి కారకులైన వారిని ఆసుపత్రిలో చేర్చి, తిరిగి హేమలతపైనే కేసు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు.

Also REad:గంజాయి కేసులో కటారి అనుచరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అడ్డుకున్న మాజీ మేయర్, చిత్తూరులో హైటెన్షన్

ఇకపోతే.. చిత్తూరులో (chittoor) హై టెన్షన్ నెలకొంది. గంజాయి కేసు పేరుతో కటారి వర్గీయుడిని తీసుకెళ్తుండగా.. అనుచరులతో కలిసి మాజీ మేయర్ హేమలత (katari hemalatha) పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీఐ జీపు తగిలి ఆమె కారుకు గాయమైంది. అయితే అధికార పార్టీ నేతల పోలీసులు చెప్పడం వల్లే ఇలా అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు (tdp) ఆరోపిస్తున్నారు. దీంతో మరోసారి కటారి అనూరాధ దంపతుల (katari anuradha) హత్య కేసు తెరపైకి వచ్చింది. 

తన అత్తమామలు దివంగత మేయర్ కటారి అనూరాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూ అనుచరులు సాక్షుల్ని బెదిరిస్తున్నారని గురువారం సాయంత్రం మూడున్నర గంటలకు హేమలత మీడియాకు తెలిపారు. ఇందులో అధికార పార్టీకి చెందిన కొందరి పేర్లను ఆమె ప్రస్తావించారు. అయితే అలా చెప్పిన కొన్ని గంటల్లోనే పోలీసులు గంజాయి కేసు పేరిట రంగంలోకి దిగడంతో రాజకీయ రగడకు తెర లేచింది. 
 

click me!