అనుమానస్పద స్థితిలో మృతిచెందిన పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ మునికుమార్ ‌

Published : Jun 25, 2022, 02:55 PM IST
అనుమానస్పద స్థితిలో మృతిచెందిన పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ మునికుమార్ ‌

సారాంశం

పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ మునికుమార్ ‌అనుమానస్పద స్థితిలో మృతిచెందారు.  కడప రైల్వేస్టేషన్ సమీపంలో ఆయన మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. 

పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ మునికుమార్ ‌అనుమానస్పద స్థితిలో మృతిచెందారు.  కడప రైల్వేస్టేషన్ సమీపంలో ఆయన మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మునికుమార్ ఆత్మహత్యకు గల కారణాలపై రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. మణికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు రైల్వే పోలీసులు తరలించారు. అయితే అతడు రైలు కిందపడి బలవనర్మణం చెందినట్టుగా భావిస్తున్నారు. 

గతంలో మునికుమార్ కడప నగర పాలక సంస్థ సూపరిండెంట్‌గా పని చేశారు. మునికుమార్ 3 నెలల కిందట డిప్యూటేషన్ పై పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే 2 రోజుల కిందట ముని కుమార్ పుట్టపర్తి నుంచి కడపకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మృతిచెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

అయితే మునికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఎవరైనా హత్య చేసి అక్కడ పడేశారా అనే వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్