
తిరుమల (tirumala) శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు ఎగబడడంతో తోపులాట జరిగిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ (tdp) అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల కష్టాలు తీవ్ర ఆవేదన కలిగించాయి. వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే... వారికి కనీసం నీడ కల్పించాలి, తాగునీటి వసతి కల్పించాలి అన్న ఆలోచన టీటీడీకి రాకపోవడం దారుణం’’.
‘‘తిరుమలను కేవలం ఆదాయ వనరు కోణంలోనే చూస్తూ... భక్తులకు దర్శనం, వసతి వంటి అంశాల్లో నిర్లక్ష్యం చూపించారు. కొండపైకి వెళ్లేందుకు కూడా ఆంక్షలు విధించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా... శ్రీవారిని భక్తులకు దూరం చేసేలా ఉన్నాయి. టీటీడీ వెంటనే మేలుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాలి ’’అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
కాగా.. కరోనా నేపథ్యంలో గత ఏడాది సర్వదర్శనం టికెట్ల జారీని టీటీడీ నిలిపివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుండి సర్వదర్శనం టికెట్లను టీటీడీ జారీ చేయడం ప్రారంభించింది. తిరుమల శ్రీవారి Sarvadarshan Ticketకు భారీ డిమాండ్ నెలకొంది. టికెట్ల కోసం మంగళవారం devotees మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో కొందరు భక్తులు స్పృహ తప్పిపడిపోయారు. సర్వదర్శనం టికెట్ల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్ కూడా స్వల్పంగా దెబ్బతింది.
Tirupati లోని మూడు చోట్ల TTD భక్తులకు సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తుంది. టీటీడీ రెండో సత్రం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం వద్ద టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ మూడు కౌంటర్ల వద్ద కూడా భారీ సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కిలోమీటర్ల దూరం భక్తులు సర్వదర్శనం టికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో గంటల తరబడి టికెట్ల కోసం చూసి విసిగిపోయిన భక్తులు టికెట్ కౌంటర్ వద్దకు తోసుకు రావడంతో తోపులాట చోటు చేసుకొంది. టీటీడీ సరైన ఏర్పాట్లు చేయని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని భక్తులు మండిపడుతున్నారు.