సగం సమస్యలు పోలీసుల వల్లే: తాడిపత్రి ఘటనపై బాబు సీరియస్

By Siva KodatiFirst Published Dec 24, 2020, 4:08 PM IST
Highlights

శ్రీకాకుళంలో తెలుగుదేశం నేతల అరెస్టును ఖండించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తానన్న వైసీపీ నేతలను వదిలి.. టీడీపీ నేతలను అరెస్టు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు

శ్రీకాకుళంలో తెలుగుదేశం నేతల అరెస్టును ఖండించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తానన్న వైసీపీ నేతలను వదిలి.. టీడీపీ నేతలను అరెస్టు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

అసలు విగ్రహాన్ని కూలుస్తామన్న మంత్రి అప్పల్రాజుపై చర్యలు తీసుకోలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. వైసీపీ నేతలు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షనేత డిమాండ్ చేశారు.

Also Read:తాడిపత్రిలో టెన్షన్: ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం

గౌతు లచ్చన్న గొప్ప యోధుడు.. బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తని చంద్రబాబు ప్రశంసించారు. ఆయన విగ్రహం పడగొడితే... నేను చూస్తూ ఊరుకుంటానానా అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అటు తాడిపత్రి ఘటనపైనా చంద్రబాబు మండిపడ్డారు. జేసీ ఇంట్లో లేనప్పుడు దాడి చేయడం సరికాదన్నారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని.. సగం సమస్యలు పోలీసుల వల్లే వస్తున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పోలీసులు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని.. రాష్ట్రాన్ని నేరస్తుల అడ్డాగా మార్చారని ప్రతిపక్షనేత మండిపడ్డారు. 

మరోవైపు గౌతు లచ్చన్నపై మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద టీడీపీ నిరసన తలపెట్టింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

నిమ్మాడలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గృహనిర్బంధం ఉంచారు. అచ్చెన్నను ఇంట్లో నుంచి రానివ్వకుండా అడ్డుకున్నారు. పలాస టీడీపీ కార్యాలయంలో గౌతు శిరీష‌ను.. సోంపేటలో మాజీ మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీ, శ్రీకాకుళంలో కూన రవికుమార్, ఎంపీ రామ్మోహన్‌నాయుడులను హౌస్ అరెస్ట్ చేశారు.. 

click me!