ఆన్‌లైన్‌ లోన్ యాప్స్ : డబ్బు కట్టినా.. ఫోన్‌లో అసభ్య పదజాలంతో దూషిస్తూ..

By AN TeluguFirst Published Dec 24, 2020, 3:24 PM IST
Highlights

ఆన్ లైన్ యాప్ ల్లో రుణాలు తీసుకున్నందుకు ఫోన్‌లో అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, పరువు తీస్తామని బెదిరిస్తున్నారని తనను ఆదుకోవాలంటూ ఓ బాధితుడు విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

ఆన్ లైన్ యాప్ ల్లో రుణాలు తీసుకున్నందుకు ఫోన్‌లో అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, పరువు తీస్తామని బెదిరిస్తున్నారని తనను ఆదుకోవాలంటూ ఓ బాధితుడు విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో అవసరం కోసం అప్పుచేసి మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో చిక్కుకొన్న బాధితులు ఒకరొకరుగా బయటకొస్తున్నారు. యాభై వేలు లోన్ తీసుకొని 2 లక్షల 80 వేలు కట్టినా వేధింపులు ఆపలేదంటూ నాగరాజు అనే బాధితుడు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

ఆన్‌లైన్‌  లోన్ యాప్‌ల ఉచ్చులో చిక్కుకొన్న తనను కాపాడి రుణ విముక్తి కలిగించాలని  వేడుకున్నాడు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ... ఫేస్‌బుక్లో ప్రకటన చూసి మొదట నాలుగు యాప్‌లలో 20వేల రూపాయల లోన్‌ తీసుకున్నానని తెలిపాడు. కమిషన్ తీసుకొని తన అకౌంట్‌లో పదకొండు వేలు వేసినట్లు తెలిపాడు. 

‘వారం లోపే లోన్ తిరిగి చెల్లించాలి. రొటేషన్ కోసం చాలా యాప్‌లలో లోన్ తీసుకొని డ్యూలు కట్టాను. 50 వేలకి 2 లక్షల ఎనభై వేలు చెల్లించినా అప్పు తీరలేదని వేధిస్తున్నారు. ఫోన్‌లో అసభ్య పదజాలంతో దూషిస్తూ క్షోభ పెడుతున్నారు. 

ఫోన్ కాంటాక్ట్ నంబర్లకు మెసెజ్‌లు పెట్టి పరువు తీస్తామని బెదిరిస్తున్నారు. నలభై శాతం వడ్డీ వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. అవసరానికి అప్పుచేసి వాళ్ళ ఉచ్చులో ఇరుక్కున్నాను. ప్రభుత్వ భరోసాతో పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేశాను. నాలాగే చాలామంది మైక్రో ఫైనాన్స్ తీసుకొని మానసిక క్షోభ అనుభవిస్తున్నారు’. అని నాగారాజు ఆవేదన వ్యక్తం చేశారు.

click me!