ఆస్తులు, పదవి ఇవ్వకుండా జగన్ మోసం.. షర్మిల రోడ్డున పడ్డారు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 04, 2021, 06:23 PM IST
ఆస్తులు, పదవి ఇవ్వకుండా జగన్ మోసం.. షర్మిల రోడ్డున పడ్డారు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

సారాంశం

వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. ఆమె తెలంగాణలో పార్టీ ఏర్పాటు కసరత్తులో ఉన్న నేపథ్యంలో షర్మిలపై తొలిసారి  స్పందించారు

వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. ఆమె తెలంగాణలో పార్టీ ఏర్పాటు కసరత్తులో ఉన్న నేపథ్యంలో షర్మిలపై తొలిసారి స్పందించారు. తెలంగాణలో షర్మిల రోడ్డుపై పడ్డారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. కర్నూలులో గురువారం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్ పిరికి పంద అంటూ టీడీపీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు సవాల్ విసిరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసునని.. ఏం పీకారని జగన్‌కు ఓటేస్తారని, ఆయనకు దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు రావాలని చంద్రబాబు సవాల్ విసిరారు.

కర్నూలు కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దమార్కెట్‌ ఎదురుగా శ్రీలక్ష్మి నరసింహస్వామి కల్యాణ మండపం వద్దకు చేరుకుని పాతబస్టాండు, గోశా హాస్పిటల్‌, స్టేట్‌ బ్యాంకు, ఎస్టీబీసీ కళాశాల మీదుగా ఐదు రోడ్ల కూడలి, మౌర్యఇన్‌, బంగారు పేట, ఈద్గా, కొత్తబస్టాండు, బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్‌కు వరకు రోడ్‌షోలో పాల్గొంటారు. రోడ్‌షోలో చంద్రబాబు ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలతో మాట్లాడుతారు. 

PREV
click me!

Recommended Stories

Ultra-Modern Bhogapuram Airport: అత్యాధునిక హంగులతో భోగాపురం ఎయిర్ పోర్ట్ చూసారా?| Asianet Telugu
Nara Loeksh Pressmeet: ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ పోర్ట్ అవసరమా అన్నారు : లోకేష్ | Asianet Telugu