
టీడీపీ (TDP) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రూట్ మార్చారు. ఇటీవల ఒంగోలులో జరిగిన మహానాడు (tdp mahanadu) కార్యక్రమం సక్సెస్ అయ్యిందనే ఉత్సాహంతో ఆయన మరింత దూకుడు పెంచారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో (Sr NTR, Centenary birth celebrations) భాగంగా ప్రతి జిల్లాలో మినీ మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టనున్నారు. అలాగే చంద్రబాబు 26 జిల్లాలలో ఏడాది పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూలు సిద్ధమవుతోంది. ఈ నెల మూడో వారం నుంచే జిల్లాల పర్యటనను చంద్రబాబు ప్రారంభించనున్నారు.
ఇక మొదటి రోజు బహిరంగ సభ.. రెండో రోజు పార్లమెంట్‌లోని 7 అసెంబ్లీ ఇంఛార్జ్‌లతో సమీక్షలు, కేడర్‌తో ఆత్మీయ సమావేశాలు సైతం ఆయన నిర్వహిస్తారు. జిల్లా పర్యటనలో మూడో రోజు వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షో ఉంటుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ప్రతిపక్షనేత మాట్లాడతారు. ఏడాదిలో 80కి పైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పర్యటనను సిద్ధం చేస్తున్నారని నేతలు. అటు జిల్లాల పర్యటనలు, ఇటు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వ్యవహారాలు సమాంతరంగా జరిగేలా షెడ్యూల్ తయారు చేస్తోంది తెలుగుదేశం.
Also REad:‘‘ గడప-గడపకు’’పై ఇంట్రెస్ట్ చూపని బొత్స, ఆళ్ల నాని, అనిల్ .. పీకే టీం ప్రజంటేషన్‌లో వెల్లడి
మహానాడుకు ముందు కూడా చంద్రబాబు కొన్ని జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. బాదుడే- బాదుడు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి జిల్లాల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఓవైపు పార్టీని బలోపేతం చేస్తూనే.. తన పర్యటనలతో కేడర్‌లో మరింత జోష్ నింపాలని ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు ఓ వైపు వైఎస్సార్‌సీపీ (ysrcp) నేతలు గడప గడపకు మన ప్రభుత్వం (gadapa gadapaku mana prabhutvam) పేరుతో ప్రజల ముంగిట్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి కౌంటర్‌గా టీడీపీ కూడా వచ్చే రెండేళ్లు తమ కేడర్‌ను ప్రజల్లోనే ఉండాలని పావులు కదుపుతోంది. ఇప్పుడు ఆ దిశగానే చంద్రబాబు పర్యటనలకు శ్రీకారం చుట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.