రూ.2000 నోటు ఉపపంహరణ .. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఏమన్నారంటే..?

By Siva KodatiFirst Published May 19, 2023, 8:45 PM IST
Highlights

రూ.2000 నోటును రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. మనీలాండరింగ్ నియంత్రణ జరగాలని కోరుకున్నానని ..ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. 

రూ.2000 నోటును రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజకీయ అవనీతి తగ్గాలంటే రూ. 2000, రూ.500 నోట్లు రద్దు కావాలని ఆయన ఆకాంక్షించారు. గతంలో డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ తానే ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి దేశ సంపదను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మనీలాండరింగ్ నియంత్రణ జరగాలని కోరుకున్నానని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. 

మరోవైపు రెండు వేల నోటు రద్దుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆనాడు రూ.2 వేలు తీసుకురావడమే తప్పని కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయ్యింది. ఇప్పుడు రూ.2000 నోట్ల రద్దు తుగ్గక్ నిర్ణయంగా అభిప్రాయపడింది. పెద్ద నోట్ల రద్దు విజయవంతమైతే రూ.2000ను ఎందుకు ఉపసంహరించుకున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. మరోవైపు.. నోట్లు నద్దు, ఉపసంహరణతో సామాన్యులను వేధిస్తున్నారని ఎన్సీపీ సైతం భగ్గుమంది. రెండు వేల నోటును ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది. 

కాగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం సంచలన ప్రకటన చేసింది. రూ. 2000 నోట్లను ఉపసంహరిస్తామని తెలిపింది. అయితే.. ఇప్పటికిప్పుడే వీటిని రద్దు చేయడం లేదు. ఇవి చెలామణిలో ఉంటాయని తెలిపింది. సెప్టెంబర్ 30వ తేదీ  వరకు ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని పేర్కొంది. లేదా.. తమ అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోవాలని తెలిపింది. అలాగే.. రూ. 2,000 నోట్లను ఖాతాదారులకు జారీ చేయవద్దని తక్షణ ఆదేశాలు ఇచ్చింది. ఇంతకీ ఈ నిర్ణయం ఆర్బీఐ ఎందుకు తీసుకున్నది? ఈ నిర్ణయంపై ఏమంటున్నది?

ALso Read: Note Ban: ఏడేళ్లలోనే రూ. 2000 నోట్లను ఆర్బీఐ ఎందుకు రద్దు చేస్తున్నది? వివరణ ఏం ఇచ్చింది?

2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. అప్పుడే కొత్తగా రూ. 2000 నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. ఇంతలోనే వీటిని ఎందుకు రద్దు చేశారనే అనుమానాలు వస్తున్నాయి. ఇందుకు ఆర్బీఐ స్పష్టంగా వివరణ ఇచ్చింది. 89 శాతం 2000 నోట్లు 2017 మార్చికి ముందే చెలామణిలోకి తెచ్చినట్టు ఆర్బీఐ తెలిపింది. వాటి లైఫ్ స్పాన్ (నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు) త్వరలో పూర్తయిపోతుందని ఆర్బీఐ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

2016 నవంబర్‌లో రూ.500, రూ. 1,000 నోట్లను రద్దు చేసినప్పుడు వెంటనే రూ. 2,000 నోట్లను అందుబాటులోకి తెచ్చారు. పెద్ద మొత్తంలో నగదు రద్దు కావడంతో ప్రజల అవసరాలకు సరిపడా నగదు తక్కువ కాలంలో అందుబాటులోకి తెచ్చే క్రమంలో రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టారు. ఇతర డినామినేషన్లు (ఇతర నోట్లు) సరిపడా అందుబాటులోకి వచ్చాయని, కాబట్టి, రూ.2,000 అవసరం పూర్తయిందని ఆర్బీఐ తెలిపింది. 2018- 19లోనే రూ.2,000 నోట్ల ముద్రణ నిలిపేసినట్టు వివరించింది.
 

click me!