కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రికి వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి: వైద్యుల చికిత్స

By narsimha lode  |  First Published May 19, 2023, 5:15 PM IST

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  తల్లి వైఎస్ లక్ష్మిని  కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రిలో  చేర్పించారు. 


కర్నూల్:  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  తల్లి వైఎస్ లక్ష్మిని  కర్నూల్  లోని  విశ్వభారతి  ఆసుపత్రిలో  చేర్పించారు.   అనంతపురం జిల్లా తాడిపత్రిలో తల్లిని పరామర్శించి  అదే  అంబులెన్స్ లో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  హైద్రాబాద్ కు బయలుదేరారు. అయితే మార్గమధ్యలోని కర్నూల్ లోని  విశ్వభారతి  ఆసుపత్రిలో  చేర్పించారు. కర్నూల్ ఆసుపత్రి  వైద్యులు వైఎస్ లక్ష్మికి  చికిత్స అందిస్తున్నారు. తల్లితో  పాటు   కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా  ఉన్నారు. 

ఇవాళ  ఉదయం వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి  వైఎస్ లక్ష్మి  అస్వస్థతకు గురయ్యారు.  ఇంట్లో కళ్తు తిరిగి పడిపోవడంతో  పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో  చేర్పించారు. ఈ ఆసుపత్రిలో  చికిత్స అందించిన తర్వాత  ఆమెను మెరుగైన చికిత్స కోసం  హైద్రాబాద్ కు తరలించారు.

Latest Videos

undefined

 తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న   వైఎస్ అవినాష్ రెడ్డి   సీబీఐ విచారణకు  వెళ్లకుండా పులివెందుల బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం  అనంతపురం జిల్లా తాడిపత్రిలో  తల్లి వస్తున్న అంబులెన్స్  అవినాష్ రెడ్డికి ఎదురైంది.  అక్కడే  తల్లిని  అవినాష్ రెడ్డి ఆమెను పరామర్శించారు. అదే అంబులెన్స్ లో  తల్లితో పాటు  కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రికి  వైఎస్ అవినాష్ రెడ్డి  చేరుకున్నారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో   ఇవాళ  విచారణకు  రావాలని  వైఎస్  అవినాష్ రెడ్డికి  సీబీఐ   నోటీసులు జారీ చేసింది.  విచారణకు  హాజరయ్యేందుకు  బయలుదేరిన  సమయంలో తల్లికి అనారోగ్యం  గురించి  కడప ఎంపీకి సమాచారం అందింది. దీంతో  వైఎస్ అవినాష్ రెడ్డి   సీబీఐ విచారణకు  హాజరు కాకుండా  పులివెందుల బయలుదేరారు.  తల్లికి అనారోగ్యం గురించి  సీబీఐ   అధికారులకు  వైఎస్ అవినాష్ రెడ్డి లాయర్లు  సమాచారం  ఇచ్చారు.

also read:తాడిపత్రిలో తల్లికి పరామర్శ: అంబులెన్స్‌లోనే హైద్రాబాద్ కు అవినాష్ రెడ్డి

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ కూడ  సీబీఐ విచారణకు  హాజరు కాలేదు.   ఈ విషయమై  సీబీఐ   ఏ రకంగా వ్యవహరిస్తుందోనని  సర్వత్రా ఉత్కంఠ  నెలకొంది.   ఈ నెల  16వ తేదీన  సీబీఐ విచారణకు  కూడా  వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు కాలేదు.

click me!