డీజీపీకి.. సీఎంకు తెలిసే టీడీపీ ఆఫీసులపై దాడి: రేపు రాష్ట్ర బంద్‌కు చంద్రబాబు పిలుపు

By Siva KodatiFirst Published Oct 19, 2021, 8:43 PM IST
Highlights

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu). ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ (ysrcp) శ్రేణుల దాడులను చంద్రబాబు ఖండించారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu). ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ (ysrcp) శ్రేణుల దాడులను చంద్రబాబు ఖండించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దాడిని పరిశీలించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమంటే ఇవ్వరా అంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడి ఇంటిపై దాడి చేస్తారా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మన పిల్లలకు భవిష్యత్ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఈ తరహా ఘటనలు చాలా దుర్మార్గమని.. డ్రగ్ మాఫియాకు (drug mafia) వత్తాసు పలుకుతారా అని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి పోరాటాలు టీడీపీ చాలా చేసిందని ఆయన గుర్తుచేశారు. తమ కార్యాలయం పక్కనే డీజీపీ, సీఎం నివాసాలు వున్నాయని.. వీళ్లకు తెలియకుండానే దాడులు జరిగాయా అని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వారిలో ముగ్గురు ఐసీయూలో వున్నారని .. వాళ్లేం పాపం చేశారని ఆయన ప్రశ్నించారు. రౌడీలతో రాజకీయం చేస్తారా అన్న ప్రతిపక్షనేత.. ప్రాణాలు పోయినా భయపడనని స్పష్టం చేశారు. తమను హౌస్ అరెస్ట్ చేశారని.. మాట్లాడే స్వేచ్ఛ లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. 

ALso read:ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులు: భద్రత కల్పించండి, కేంద్ర హోంశాఖను కోరిన బాబు

తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజల కోసం చాలా పోరాడానని ఆయన గుర్తుచేశారు. ఏపీ డ్రగ్ కేంద్రంగా మారిందని.. మాఫీయాతో జాతి నిర్వీర్యం అయిపోతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న హింసేనని ఆయన ఆరోపించారు. పులివెందుల రాజకీయం కాదని.. ఏపీ రాజకీయమని డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతోందని.. ఆర్టికల్ 356 (article 356) ప్రయోగించే పరిస్ధితి తెచ్చారని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి రౌడీలను తన జీవితంలో చాలా మందిని చూశానని.. పిలిస్తే వచ్చి రౌడీయిజం చేస్తే చివరికి నాశనమవుతారని చంద్రబాబు జోస్యం చెప్పారు. ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత వుండే ఎమ్మెల్యేలు ఏపీలోనే వున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. 

 

"

 

గవర్నర్‌, కేంద్రమంత్రి ఫోన్‌ ఎత్తారు.. డీజీపీ (ap dgp) ఎత్తరా?. అడిగితే.. సమావేశం ఉంది బీజీగా ఉన్నానని చెప్పారంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఇన్నాళ్లూ తిట్టారు, జైలులో పెట్టారు.. ఇప్పుడు కొడతారా? రెండున్నరేళ్లుగా మీ వేధింపులు చూస్తున్నామని టీడీపీ అధినేత దుయ్యబట్టారు. హెరాయిన్‌ గురించి మాట్లాడితే ఏం తప్పు? ఏపీలో గంజాయి (ganja) సాగు ఉందని పక్క రాష్ట్రాల డీజీపీలు చెప్పారని ఆయన గుర్తుచేశారు. గంజాయి సాగు పెరిగిందని టీడీపీ నేతలు అనడమే తప్పా? తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయని ఆయన మండిపడ్డారు. దాడి విషయం తెలియకుంటే ఆ పదవికి డీజీపీ అర్హుడా?’’ అని చంద్రబాబు ప్రశ్నంచారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈదాడులను ఖండించాలని, రేపటి బంద్‌ను విజయవంతం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 

click me!