ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి చంద్రబాబు లేఖ

By Siva Kodati  |  First Published Oct 20, 2021, 10:14 PM IST

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) , ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు (amit shah) టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం లేఖలు రాశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు


ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం (kommareddy pattabhi ram) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులు.. రాష్ట్ర బంద్ వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) , ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు (amit shah) టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం లేఖలు రాశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర పరిస్ధితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షనేతలకు, పార్టీ ఆఫీసులకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఆయన కోరారు. 

మరోవైపు టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను భారీ బందోబస్త్ మధ్య గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. అయితే పోలీసుల తీరుపై పట్టాభి భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని.. ఆయనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని ఆమె ఆరోపించారు. ఈ విధంగా అరెస్ట్ చేయడంపై కోర్టుకెక్కుతామని పట్టాభి భార్య హెచ్చరించారు. ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా చూపించలేదని ఆమె ఆరోపించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదని ధ్వజమెత్తారు. ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే తర్వాత ఇస్తామన్నారని ఆమె ఆరోపించారు.  మరోవైపు పట్టాభిపై 153 ఏ, 505 (2), 504 (ఆర్/ డబ్ల్యూ), 120 బీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Latest Videos

undefined

ALso Read:పట్టాభి అరెస్ట్: తలుపులు పగులగొట్టి బలవంతంగా లాక్కెళ్లారని భార్య

కాగా.. తెలుగుదేశం పార్టీ ( telugu desam party ) కార్యాలయాలపై మంగళవారం వైసీపీ (ysrcp) శ్రేణులు దాడి చేసిన ఘటనలతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే వైసీపీ చర్యలను నిరసిస్తూ.. బుధవారం ఏపీ బంద్‌కు (ap bandh) టీడీపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) రేపు నిరసన దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 వరకు ఆయన దీక్ష చేయనున్నారు. టీడీపీ ఆఫీసులపై దాడికి నిరసనగా ఈ దీక్ష చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 

మరోవైపు, నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోరారు. శనివారంనాడు తనకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని చంద్రబాబు అమిత్ షాను కోరారు. తమ పార్టీ కార్యాలయాలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చేసిన దాడిపై ఆయన అమిత్ షాకు ఫిర్యాదు చేయనున్నారు. ఇదిలావుంటే మంగళవారం mangalagiri లోని tdp head office తో పాటు వివిధ చోట్ల టిడిపి ఆఫీసులపై దాడులు చేసిన 70 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. దాడుల సమయంలో తీసిన వీడియోలు, సిసి కెమెరాలో రికార్డయిన వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల నుండి సేకరించిన వివరాల ఆధారంగా కొందరిని గుర్తించినట్లు... వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. టిడిపి కార్యాలయాలపై దాడులపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 

click me!