టీడీపీ నేత పట్టాభి ఇంటి దగ్గర భారీగా పోలీసులు.. ఏ క్షణమైనా అరెస్ట్..?

By Siva KodatiFirst Published Oct 20, 2021, 8:58 PM IST
Highlights

సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి (Pattabhi)ని పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. తాజాగా విజయవాడలోని ఆయన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. సీఎం జగన్‌ (CM YS Jagan Mohan Reddy)ను పట్టాభి దూషించారంటూ కేసులు నమోదు చేసి ఉంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ శ్రేణులు (ysrcp) భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత పట్టాభి ఇల్లు, తెలుగుదేశం కార్యాలయాలపై అధికార పార్టీ శ్రేణులు దాడులుచేయడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే... మరోవైపు సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి (Pattabhi)ని పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. తాజాగా విజయవాడలోని ఆయన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. సీఎం జగన్‌ (CM YS Jagan Mohan Reddy)ను పట్టాభి దూషించారంటూ కేసులు నమోదు చేసి ఉంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇది నేరమని, దీనిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే పట్టాభి కావాలనే వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టారంటూ అధికార పార్టీ నేతలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. పట్టాభి వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందంటూ వారు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టాభిని విచారించి పోలీసులు నోటీసులు ఇస్తారా లేదా ఆయన్ను అదుపులోకి తీసుకుంటారోనన్న అనుమానాలతో టీడీపీ శ్రేణులు సైతం ఆయన ఇంటి వద్ద భారీగా చేరుకుంటున్నాయి.

కాగా.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు (nakka ananda babu) పోలీసులు నోటీసులు అందించడంపై టీడీపీ (tdp) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళవారం ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలెస్ పాలేరు ఆడమన్నట్టు పోలీసులు ఆడతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. ఏపీ గంజాయికి అడ్డాగా (ganja cultivation in andhra pradesh) మారిందని.. అలాంటి పరిస్థితి లేకుంటే తెలంగాణ (telangana police), తమిళనాడు (tamilnadu police) పోలీసులు గంజాయి స్మగ్లర్లని పట్టుకోవడానికి ఏపీకి ఎందుకు వచ్చారని పట్టాభి ప్రశ్నించారు.

ALso Read:టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడులు: 36 గంటల పాటు దీక్షకు సిద్ధమైన చంద్రబాబు.. రేపు ఉదయమే స్టార్ట్

నిన్న మధ్యాహ్నం మాదకద్రవ్యాలపై ఆనందబాబు మీడియా సమావేశంలో మాట్లాడితే అర్థరాత్రి పోలీసులు (ap police) ఆనందబాబు ఇంటికి రావడంపై పట్టాభిపై మండిపడ్డారు. నర్సీపట్నం నుంచి గుంటూరు రావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్నింట్లో ఇంత మెరుపువేగంగా పోలీసులు స్పందిస్తే బాగుండునన్నారు. పక్కనున్న ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతుంటే.. అక్కడికి వెళ్లే తీరికలేని పోలీసులు.. ఆనందబాబుకు నోటీసులు ఇవ్వడానికి మాత్రం గుంటూరుకు ఆగమేఘాలమీద వచ్చారని మండిపడ్డారు.

ఆనంద్ బాబుకు నోటీసులివ్వడంలోచూపిన మెరుపువేగం, గంజాయిసాగుని అరికట్టడంలో చూపితే బాగుండేదంటూ పోలీసులపై కొమ్మారెడ్డి పట్టాభి ఫైర్ అయ్యారు. పైస్థాయి అధికారులు చెప్పారు కదా అని, కిందిస్థాయిలో ఉన్న పోలీసులు శృతిమించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారందరూ భవిష్యత్‌లో చట్టపరంగా, న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని పట్టాభి హెచ్చరించారు. ఆ వెంటనే వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలపై, పట్టాభి ఇంటిపై దాడి చేశారు.

click me!