ఎన్జీటీ ఆదేశాలను తక్షణమే అమలు చేయండి: సీఎస్‌కు లేఖ రాసిన చంద్రబాబు

Published : Apr 29, 2022, 10:59 AM IST
ఎన్జీటీ ఆదేశాలను తక్షణమే అమలు చేయండి: సీఎస్‌కు లేఖ రాసిన చంద్రబాబు

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాశారు. గ్రానైట్ మైనింగ్‌పై ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయాలని చంద్రబాబు లేఖలో కోరారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాశారు. గ్రానైట్ మైనింగ్‌పై ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయాలని చంద్రబాబు లేఖలో కోరారు. చిత్తూరు  జిల్లా మదనపల్లిలో అక్రమ మైనింగ్‌ను ఎన్జీటీ నిర్దారించిందని లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ముద్దనపల్లిలో సర్వే నెంబర్ 104, 213లలో అక్రమ మైనింగ్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సీఎస్‌కు రాసిన లేఖకు జతచేశారు.

గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ ఇచ్చిన అదేశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ పాల్పడిన వారి పేర్లు, వివరాలు తెలపాలన్న ఎన్జీటి ఆదేశాలను చంద్రబాబు ఆ లేఖలో ప్రస్తావించారు. సీఎస్ సహా ఇతర అధికారులు స్వయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న ఎన్జీటీ ఆదేశాలను అమలు చేయాలని కోరారు. పటిష్టమైన చర్యలతో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!