ఏపీలో టెన్త్ పరీక్షల్లో గందరగోళం: చిత్తూరులో టెన్త్ పరీక్షా కేంద్రాన్ని మార్చిన అధికారులు

By narsimha lodeFirst Published Apr 29, 2022, 10:16 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్షల నిర్వహణ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కన్పిస్తుంది.  తెలుగు ప్రశ్నాపత్రం, హిందీ ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాల్లో కన్పించాయి.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Tenth Class పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటకు వచ్చింది. టెన్త్ క్లాస్ పరీక్షల్లో వరుసగా Question Papers బయటకు వస్తున్నాయి. అయితే ప్రశ్నాపత్రాలను బయటకు తీసుకొచ్చిన వారిని Police అరెస్ట్ చేశారు. తాజాగా Chittoor జిల్లాలో అధికారులు ఏకంగా Exam కేంద్రాన్ని మార్చేశారు. 

చిత్తూరు జిల్లాలోని Vijayam స్కూల్ లో జరగాల్సిన పరీక్షలను  విజయం డిగ్రీ కాలేజీలోకి మార్చారు  అధికారులు. విజయం డిగ్రీ కాలేజీలో ఓ వైపు విద్యార్ధులకు క్లాసులు జరుగుతున్నాయి. మరో వైపు టెన్త్ క్లాస్ విద్యార్ధులు పరీక్షలకు హాజరౌతున్నారు. పరీక్షా కేంద్రం మార్చిన విషయం తెలియని స్క్యాడ్ బృందాలు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే పరీక్షా కేంద్రాన్ని ఎందుకు మార్చారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. 

ఈ నెల 27 నుండి ఏపీ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ప్రారంభమైన రోజు నుండే పేపర్ లీకయ్యాయని ప్రచారం సాగింది. చిత్తూరు, నంద్యాల జిల్లాలో తెలుగు కాంపోజిట్ పేపర్ లీకైనట్టుగా ప్రచారం సాగింది. నంద్యాల జిల్లాలోని అంకిరెడ్డిపల్లె స్కూల్ నుండి టెన్త్ ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత  సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం లీక్ కావడంతో  పేపర్ లీకైనట్టు కాదని  విద్యాశాఖ కమిషనర్ ప్రకటించారు.  మరో వైపు గురువారం నాడు హిదీ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం కూడా  సోషల్ మీడియాలో లీకైంది. ఉదయం 10 గంటలకు హిందీ ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండల పరిధిలోని తిరుమలయ్యపల్లె స్కూల్ లోని పరీక్షా కేంద్రంలో టెన్త్ ప్రశ్నా పత్రం లీకైందని అధికారలు గుర్తించారు. నర్సరావుపేటలో కూడా పేపర్ లీకైందనే ప్రచారం సాగింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా టెన్త్ క్లాస్ పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని ప్రచారం సాగడం, సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రాలు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. 

నెల్లూరు జిల్లాలో ప్రశ్నాపత్రాలు మార్చిన అధికారులు

Nellore  జిల్లా ఆత్మకూరులో  ఒక పరీక్షకు బదులుగా మరో ప్రశ్నాపత్రం అందించడంతో విద్యార్ధి ఇబ్బంది పడ్డారు. తెలుగు పరీక్ష రోజున హిందీ ప్రశ్నాపత్రం అందించారు. హిందీ పరీక్ష రోజన తెలుగు ప్రశ్నాపత్రం ఇచ్చారు. హెడ్ మాస్టర్  నిర్లక్ష్యమే కారణమని విద్యార్ధి తల్లీదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.  
 

click me!