నెల్లూరులో దళితుడి ఆత్మహత్య.. ఆ వైసీపీ నేతలపై చర్యలు తీసుకోండి : డీజీపీకి చంద్రబాబు లేఖ

By Siva KodatiFirst Published Aug 22, 2022, 3:54 PM IST
Highlights

నెల్లూరు జిల్లా కావలిలో దళితుడు దుగ్గిరాల కరుణాకర్ మృతిపై డిజిపికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వైసిపి నేతల వేధింపులకు తాళలేక కరుణాకర్‌ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ అధినేత పేర్కొన్నారు. 

నెల్లూరు జిల్లా కావలిలో దళితుడు దుగ్గిరాల కరుణాకర్ మృతిపై డిజిపికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కరుణాకర్ ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దుర్భరమైన స్థితిలో ఉన్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బలహీన వర్గాలు, దళితులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని.. కావలిలో కరుణాకర్ ఆత్మహత్య రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమన్నారు. 

కరుణాకర్ ముసునూరులోని రెండు చేపల చెరువులను సబ్ లీజుకు తీసుకుని భారీగా పెట్టుబడి పెట్టాడని.. అయితే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సురేష్‌రెడ్డి చెరువుల్లో చేపలు పట్టకుండా అడ్డంకులు సృష్టించి వేధించారని చంద్రబాబు ఆరోపించారు. వైసిపి నేతల వేధింపులకు తాళలేక కరుణాకర్‌ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ అధినేత పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరైన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శ్రీశైలం దేవస్థానం బోర్డులో పదవిలో కూడా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. దళితులపై దాడుల ఘటనల్లో ఈ మూడేళ్లలో కఠిన చర్యలు లేకపోవడం వల్లనే నిందితులు బరితెగిస్తున్నారని ప్రతిపక్షనేత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సరైన, తక్షణ చర్యల ద్వారా మాత్రమే దళితులకు రక్షణ దొరుకుతుందని.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. 

Also REad:మహిళా నేతలు వైసీపీలో వుండలేకపోతున్నారు.. అరాచక పాలన అంతమొందిస్తా : చంద్రబాబు

ఇకపోతే.. ఇటీవల వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు చంద్రబాబు . పల్నాడు జిల్లాలో వడ్డెర కులస్తులను ముగ్గురాయి వ్యాపారం చేసుకోనివ్వడం లేదని మండిపడ్డారు. వైసీపీ నాయకురాలు స్వయంగా బాధితులకు అండగా నిలబడితే.. ఆమెను వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏపీయేనన్నారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల మెజార్టీ వుంటే.. రాజ్యాంగం వుందన్నారు. అందులో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యతలు వున్నాయని... రాష్ట్రాన్ని కాపాడేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని చంద్రబాబు తెలిపారు. 

మనసు వున్నవాడేవ్వడూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వుండడని చంద్రబాబు అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పార్టీని చూడలేదని ఆయన పేర్కొన్నారు. వైసీపీలో తనలాంటి గౌరవప్రదమైన మహిళలు వుండలేరని ఉయ్యూరు జడ్పీటీసీ చెప్పిందని చంద్రబాబు గుర్తుచేశారు. పనికంటే.. తన పరువు ముఖ్యమని చెప్పి పదవికి రాజీనామా చేసిందన్నారు. మహారాష్ట్ర నుంచి అనంతపురం ద్రాక్షతోటల్లో పనిచేయడానికి వచ్చిన ముగ్గురు కూలీలు నాసిరకం మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

click me!