కారణమిదీ:పల్నాడు 'స్పందన'కార్యక్రమంలో వివాహిత ఆత్మహత్యాయత్నం

By narsimha lodeFirst Published Aug 22, 2022, 3:35 PM IST
Highlights

భార్యాభర్తల పంచాయితీ విషయంలో సీఐ తనకు న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ పల్నాడు ఎస్పీ కార్యాలయంలో సోమవారం నాడు వివాహిత ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. 

గుంటూరు: తన కేసు విషయంలో సీఐ న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ స్పందన కార్యక్రమంలో పల్నాడు ఎస్పీ కార్యాలయంలో సోమవారం నాడు  వివాహిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ప్రతి సోమవారం నాడు స్పందన కార్యక్రమాన్ని ఏపీలో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహిస్తారు. ఇవాళ పల్నాడు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఓ వివాహిత ఎస్పీకి వినతి పత్రం సమర్పించేందుకు వచ్చారు . భార్యాభర్తల గొడవ విషయమై సీఐ తనకు న్యాయం చేయడం లేదని ఎస్పీకి ఫిర్యాదు చేయాలని ఆమె ఎస్పీ కార్యాలయానికి వచ్చారు.ఈ విషయమై ఆమె స్పందన కార్యక్రమం సాగుతున్న గదిలోనే తన గోడును చెప్పుకొంటూ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

గతంలో కూడా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల వద్ద ఆత్మహత్యాయత్నాలు చోటు చేసుకొన్నాయి. కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలే కాదు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా ఆత్మహత్యాయత్రాలు చోటు చేసకున్నాయి.  తమ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో పాటు   అధికారులు తమకు న్యాయం చేయడం లేదని ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. 

click me!