వాళ్ల నాన్న టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోలేదా.. వైఎస్ కంటే జగన్ గొప్పోడా : చంద్రబాబు వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 08, 2022, 07:37 PM ISTUpdated : May 08, 2022, 07:41 PM IST
వాళ్ల నాన్న టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోలేదా.. వైఎస్ కంటే జగన్ గొప్పోడా : చంద్రబాబు వ్యాఖ్యలు

సారాంశం

వచ్చే ఏపీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు దాదాపుగా డిసైడ్ అయినట్లుగానే వాతావరణం కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి వ్యాఖ్యలు ఒకేలా కనిపిస్తున్నాయి. తాజాగా జనసేనతో పొత్తుకు టీడీపీ అధినేత అనుకూలంగానే మాట్లాడినట్లుగా తెలుస్తోంది. 

2024 ఎన్నికలకు (ap elections 2024) సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల మధ్య పొత్తు పొడిచేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు (chandrababu naidu) కాకినాడలో చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో పొత్తులపై టీడీపీ (tdp) అధినేత మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై వైసీపీ ఎగిరెగిరి పడుతోందని దుయ్యబట్టారు. రాజకీయాల్లో పొత్తులు సహజమని.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే నాశనమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మళ్లీ కోలుకోలేనంతగా రాష్ట్రాన్ని నాశనం చేశారని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లో వుండి టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లారని చంద్రబాబు గుర్తుచేశారు. వైఎస్సార్ కంటే జగన్ గొప్పవాడా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వుందని.. ఈసారి వైసీసీకి ఎక్కడా డిపాజిట్లు రావని చంద్రబాబు జోస్యం చెప్పారు. పొత్తులపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

వైసీపీ అరాచకాలు ఇంకెంతో కాలం కొనసాగవని, ముగింపు పలకడానికి సమయం దగ్గరపడిందని టీడీపీ అధినేత హెచ్చరించారు. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) దౌర్జన్యాలు మితిమీరాయని చంద్రబాబు ఆరోపించారు. సదుంలో టీడీపీ నేత రాజారెడ్డిని (raja reddy) వైసీపీ శ్రేణులు (ysrcp) హతమార్చేందుకు యత్నించాయని, హత్యాయత్నంపై పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిన జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

అంతకుముందు ఉదయం పవన్ కల్యాణ్ (pawan kalyan) మీడియాతో మాట్లాడుతూ.. జనసేనను (janasena) బలోపేతం చేసే దిశగా  అడుగులు వేస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని.. ఇది వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ అద్భుత పాలన చేయవచ్చని అన్నారు. కానీ సంఖ్య బలం ఉందని దౌర్జన్యం చేసే పరిస్థితులు ఉన్నాయని.. వారు పద్దతి మార్చుకోవాలని  సూచించారు. యువతకు ఉద్యోగాలు లేవని.. ఎవరైనా గొంతు ఎత్తితే వారిపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ చర్యలకు జనసేన వెనక్కి తగ్గదని.. ఈ తరం అసలు తగ్గదని అన్నారు.  

చంద్రబాబు త్యాగాలకు సిద్దమని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందించిన పవన్ కల్యాణ్.. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడేది కావాలన్నారు. వ్యక్తిగతంగా తాను ఏ లాభాపేక్ష కోరుకోనని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ మరింతగా అంధకారంలోకి వెళ్లిపోతుందని, పరిస్థితులు మరింతగా దిగజారిపోతాయని చెప్పారు. 

ఓటు  చీలిపోతే రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు చాలా మంది కలిసి పనిచేయాలన్నారు. విశాల దృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు భరోసా కల్పించడానికి.. ఎంతవరకు అందరూ కలిసి వస్తారనేది భవిష్యత్తులో తేలుతుందన్నారు. దీనిపై చర్చ జరగాల్సిన అవరసం ఉందన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పారు. ఏపీ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలన్నారు. ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నట్టుగా చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu