
ఒంగోలులో జరిగిన మహానాడులో (mahanadu) వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను (ys vivekananda reddy) టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ప్రస్తావించారు. కాకినాడలో సుబ్రమణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ (ysrcp mlc ananthababu) హత్య చేస్తే దాచి పెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. తాము పోరాటం చేస్తే ఎమ్మెల్సీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారని... మరి బాబాయ్ వైఎస్ వివేకాను హత్య చేసిన ఎంపీ అవినాష్ రెడ్డిని (ys avinash reddy) ఎందుకు అరెస్ట్ చేయరని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారని టీడీపీ అధినేత ఆరోపించారు. చిత్తశుద్ది ఉంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా..? అని చంద్రబాబు సవాల్ విసిరారు.
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తోన్న సీబీఐ (cbi) అధికారులను బెదిరించారని ఆయన ఆరోపించారు. దావోస్ వెళ్లి తాను తెచ్చిన కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గతంలో తాను ఒప్పందాలు కుదుర్చుకున్న అదానీ, గ్రీన్కో కంపెనీల ఒప్పందాలను రద్దు చేసినట్టు నాటకాలు ఆడారని దుయ్యబట్టారు. బ్లాక్ మెయిల్ చేసి లొంగాక తిరిగి దావోస్ వెళ్లి ఒప్పందం కుదుర్చుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఉద్యోగులకు తాను అండగా ఉంటానని.. కరోనా కంటే ఈ సీఎం డేంజర్ అంటూ సెటైర్లు వేశారు. అమ్మఒడికి చాలా నిబంధనలు పెట్టి ఏ మాత్రం తేడా జరిగినా కట్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. నాన్న బుడ్డికి మాత్రం ఏం ఇబ్బంది ఉండదని.. వ్యాపారస్తులను బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. బీసీలను వైసీపీలో బానిసలుగా చూస్తారని... ఈ ప్రభుత్వ పాలనలో ఎస్సీలూ ఇబ్బందులు పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు.
ALso Read:మూడేళ్లలో జగన్ అవినీతి రూ.1.75 లక్షల కోట్లు..ఎంక్వైరీ తప్పదు, మొత్తం కక్కిస్తా: చంద్రబాబు నాయుడు
అన్ని ఎంక్వైరీ చేయిస్తానని... జగన్ (ys jagan) అవినీతిని కక్కిస్తానని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ మూడేళ్లలో జగన్ అవినీతి సంపాదన లక్షా 75 వేల కోట్లని చంద్రబాబు ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. వైసీపీకే ఉరేయాలని, ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజలే తీర్చాలని.. భూముల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు తమ భూములను కాపాడుకోవాలని ఆయన సూచించారు. బాదుడే బాదుడులో వచ్చిన సొమ్ము ఎక్కడికి పోయిందని చంద్రబాబు ప్రశ్నించారు.
రాజధాని అమరావతిని నాశనం చేశారని.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వెలుగొండ ప్రాజెక్ట్‌తో పాటు ప్రకాశం జిల్లాలో వున్న అన్ని పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జగన్ రోడ్లు బాగు చేయకపోయినా మీరు నిలదీయడం లేదంటూ ప్రజలను ప్రశ్నించారు. రోడ్లు నాగరికతకు చిహ్నమని.. వాజ్‌పేయ్ హయాంలో రోడ్లకు పెద్దపీట వేసేలా చేసిందని టీడీపీయేనని ఆయన గుర్తుచేశారు. కోడికత్తి కేసు ఏమైపోయిందన్న చంద్రబాబు .. కోడికత్తితో జగన్ డ్రామాలు ఆడారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్లు బాగున్నాయా.. అసలు రాష్ట్రంలో రోడ్లు వున్నాయని జగన్‌కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా వైసీపీ అరాచకాలను ఎండగట్టాలని.. మీడియాకు కూడా అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.