వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే తిరగబడండి: ఒంగోలులో మహానాడును ప్రారంభించిన చంద్రబాబు

By narsimha lodeFirst Published May 27, 2022, 12:28 PM IST
Highlights

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే తిరగబడాలని చంద్రబాబు రైతులను చంద్రబాబు కోరారు. ఇవాళ ఒంగోలులో చంద్రబాబునాయుడు మహానాడులో ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.

ఒంగోలు: వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే తిరగబడాలని రైతులను కోరారు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు. శుక్రవారం నాడు ongoleలో Mahanaduను TDP  చీప్ Chandrababu Naidu ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.  వ్యవసాయ మోటార్లు మీటర్లు బిగించడం వల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి Farmers బ్యాంకు ఖాతాల్లో డబ్బులు చెల్లిస్తామని చెబుతున్నప్పటికీ భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించకుండా అడ్డుకోవాలని రైతులను కోరారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

YCP  పాలనపై ప్రజలు అసహనంతో ఉన్నారని చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  టీడీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమంగా కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడేది లేదన్నారు. తమ పార్టీకి చెందిన కీలక నేతలను అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టారని ఆయన గుర్తు చేశారు. పార్టీ నేతలు,కార్యకర్తలు జైల్లో పెట్టిన సమయంలో వారిని విడిపించేందుకు గాను రాత్రంగా నిద్రలేని రాత్రులు గడిపినట్టుగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.  పోలీసులను అడ్డు పెట్టుకుని వైసీపీ అరాచకం చేయాలని చూస్తుందని చంద్రబాబు విమర్శలు చేశారు. వైసీపీ సర్కార్ ఎన్ని Case లు పెట్టుకున్న భయపడేది లేదన్నారు.  ఎన్ని ఇత్తిళ్లు వచ్చినా  కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారని చంద్రబాబు చెప్పారు. 'సంఘ విద్రోహశక్తులను వదిలేసి టీడీపీ కార్యకర్తలపై కేసులు బనాయించారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

also read:టీడీపీ అధికారంలోకి రాగానే కార్యకర్తలదే అధికారం: ఒంగోలు మహానాడులో అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో ఉన్మాని పాలన శాపంగా మారిందన్నారు. ఈ పాలనను ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.చేతకాని దద్దమ్మపాలనతో Andhra Pradesh పరువు పోయిందని చంద్రబాబు చెప్పారు. అమ్మఒడి అన్నారు, నాన్న బుడ్డీ పెట్టారని చంద్రబాబు సెటైర్లు వేశారు.

కోనసీమ జిల్లాను సర్వనాశనం చేసేందుకు  కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. అంబేద్కర్  పై ప్రేమ ఉంటే 125 అడుగుల విగ్రహం అమరావతిలో పెట్టాలని తాము ప్లాన్ చేశామన్నారు. ఎందుకు దాన్ని పూర్తి చేయలేదో చెప్పాలని  చంద్రబాబు ప్రశ్నించారు. నేషనల్ ప్రంట్ చైర్మెన్ గా ఎన్టీఆర్ ఉన్న సమయంలో నే అంబేద్కర్ కి భారత రత్న ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఒక్క సమస్య నుండి తప్పించుకొనేందుకు మరో సమస్య సృష్టిస్తున్నారన్నారు. మంత్రి విశ్వరూప్ ను కాపాడిన పోలీసులు ఆయన ఇంటిని ఎందుకు కాపాడలేకపోయారో చెప్పాలన్నారు. మంత్రి ఇంటిని వైసీపీ వాళ్లే దగ్దం చేసుకున్నారని చంద్రబాబు విమర్శించారు.

ఏపీలో ఇటీవల వైసీపీ ఇచ్చిన  రాజ్యసభ సీట్ల ఎంపిక విషయమై కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. సామాజిక న్యాయం పాటించారని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని చంద్రబాబు తిప్పికొట్టారు.  ఉత్తరాంధ్ర, రాయలసీమకు రాజ్యసభ సీట్లను కేటాయించలేదన్నారు. మీ కేసులు వాదించే లాయర్లకు రాజ్యసభ సీటిచ్చారన్నారు. తెలంగాణలో ఉన్న టీడీపీ మాజీ నేతకు కూడా రాజ్యసభ సీటిచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు.జగన్ ఆదాయం పెరిగింది కానీ ప్రజల ఆదాయం, ఆస్తుల విలువ తగ్గిపోయిందన్నారు.  క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.


 

click me!