టీడీపీ అధికారంలోకి రాగానే కార్యకర్తలదే అధికారం: ఒంగోలు మహానాడులో అచ్చెన్నాయుడు

By narsimha lode  |  First Published May 27, 2022, 11:52 AM IST

 అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో పార్టీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం బనాయించిన కేసులను ఒక్క సంతకంతో తీసివేయిస్తామని టీడీపీ ఏపీ  రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు.


ఒంగోలు: వచ్చే ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే  కార్యకర్తలదే అధికారమని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.  ప్రస్తుతం వైసీపీ పాలనలో ఇబ్బంది పడిన  కార్యకర్తలతోనే శిక్ష విధించేలా న్యాయబద్దమైన చట్టబద్దమైన అధికారాలు తెప్పిస్తామన్నారు.  Chandrababu Naidu సీఎం కాగానే  టీడీపీ కార్యకర్తలపై బనాయించిన కేసులను ఒక్క కేసుతోనే ఎత్తివేస్తామన్నారు.

శుక్రవారం నాడు Ongole లో ప్రారంభమైన టీడీపీ మహానాడులో TDP  ఏపీ అధ్యక్షుడు Atchannaidu ప్రసంగించారు. గతంలో జరుపుకున్న మహానాడుకు ఈ Mahanaduకు చాలా తేడా ఉందన్నారు అచ్చెన్నాయుడు  పార్టీ పుట్టి 40 ఏళ్లు అయిందని చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ప్రజల  మధ్యే ఉన్నామన్నారు.ప్రజల హృదయాల్లో పుట్టినపార్టీ టీడీపీ అని ఆయన చెప్పారు. 

Latest Videos

YCP  ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న చార్జీలను నిరసిస్తూ తలపెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. YS Jagan  జగన్ సర్కార్ టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆయన చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎంగా ఎన్నికయ్యాక ఒకే ఒక్క సంతకంతో కేసులన్నీ తొలగిస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రాన్ని  జగన్ నాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు.తెలుగుదేశం పార్టీని జగన్ ఏమీ చేయలేరన్నారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
 

click me!