కుటుంబ సాధికార సారథులు.. చంద్రబాబు కీలక ప్రకటన.. వైసీపీ ఎదుర్కొనేలా స్కెచ్..!

Published : Feb 16, 2023, 04:22 PM IST
కుటుంబ సాధికార సారథులు.. చంద్రబాబు కీలక ప్రకటన.. వైసీపీ ఎదుర్కొనేలా స్కెచ్..!

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యుహాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యుహాన్ని తెరపైకి తీసుకొచ్చారు. టీడీపీలో కుటుంబ సాధికార సారథుల పేరుతో కొత్త వ్యవస్థను ప్రారంభించనున్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రతి 30 కుటుంబాలకు సాధికార సారథులను నియమిస్తామని చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ‘‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’’ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే గా జగ్గంపేటలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కార్యకర్తలే టీడీపీ ఆస్తి అని అన్నారు. టీడీపీ అంటే సంక్షేమానికి మారు పేరు అని పేర్కొన్నారు. చనిపోయిన  కార్యకర్తల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నామని తెలిపారు. టీడీపీలో ఎవరూ ఆనాథలు కాదని.. ప్రతి కార్యకర్తకు భద్రత ఉంటుందని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి న్యాయం చేయలేకపోయామని అన్నారు. ఈసారి అలా జరగకుండా పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. పార్టీలో ఉన్న సెక్షన్ ఇంచార్జ్‌లను కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామని చెప్పారు. ప్రతి 25 నుంచి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథిని నియమించనున్నట్టు వెల్లడించారు. సాధికార సారథుల నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. సాధికార సారథులు పెత్తనం చేయడానికి కాదని.. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేందుకేనని తెలిపారు. 

వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. అధికార యంత్రాంగం, రౌడీలను ఉపయోగించి ప్రజల అభిప్రాయాలను సీఎం జగన్ మార్చాలని అనుకుంటున్నారని విమర్శించారు. జగన్ అధికారం పోవడం ఖాయమని చెప్పారు. జగన్‌.. ఏం చేస్తున్నాడో.. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడని విమర్శించారు. ఆయనను చూసి రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారని ప్రశ్నించారు. 

ఇక, ప్రస్తుతం ఏపీలోని అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి రావడానికి పావులు కదుపుతుంది. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన వైసీపీ.. ఇప్పుడు గృహ సారథులను ఏర్పాటు చేసి ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ కూడా కుటంబ సాధికార సారథులతో వైసీపీకి కౌంటర్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu
IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు