సీఎం జగన్‌తో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ భేటీ.. ఫిబ్రవరి 23న స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్..!

Published : Feb 16, 2023, 03:56 PM IST
సీఎం జగన్‌తో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ భేటీ.. ఫిబ్రవరి 23న స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్..!

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ భేటీ అయ్యారు. వెంకటరమణను  మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి తీసుకొనివచ్చారు. సీఎం జగన్ సమక్షంలో జయమంగళ వెంకటరమణ వైసీపీ కండువా కుప్పుకునే అవకాశం ఉంది. ఆయనకు వైసీసీ ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసిందనే ప్రచారం కూడా ఉంది.  వైసీపీలో చేరనున్న జయమంగళ వెంకటరమణ ఈ నెల 23 స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు  చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

జయమంగళ వెంకరమణ  కైకలూరు నియోజకవర్గం నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కైకలూరు టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న జయమంగళ వెంకటరమణ.. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు నచ్చి వైసీపీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. 

గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై జయమంగళ వెంకటరమణ అసంతృప్తితో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కైకలూరు నుంచి టికెట్ కేటాయించే విషయంలో అధిష్టానం హామీ ఇవ్వకపోవడంపై వెంకటరమణ అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఒకవేళ ఇతర పార్టీలతో పొత్తులుంటే తన టికెట్ పరిస్థితి ఏమిటనే దానిపై ఆయన ఆవేదనతో ఉన్న ఆయన పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారు. జయమంగళ వెంకటరణమణ వైసీపీ గూటికి తీసుకురావడంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక భూమిక పోషించారు. 
 

PREV
click me!

Recommended Stories

వెన్నుపోటు పరిపాలన: మార్గాన్ని భరత్ | Margani Bharat Fires on Chandrababu | Asianet News Telugu
Jogi Ramesh Open Challenge: టైం, డేట్ చెప్పు నేను రెడీ లోకేష్ కి జోగిరమేష్ ఛాలెంజ్| | Asianet Telugu