ముస్లింలతో భేటీ ఎఫెక్ట్: ఎన్‌పీఆర్‌పై వెనక్కితగ్గిన జగన్మోహన్ రెడ్డి

Siva Kodati |  
Published : Mar 03, 2020, 06:09 PM ISTUpdated : Mar 03, 2020, 06:13 PM IST
ముస్లింలతో భేటీ ఎఫెక్ట్: ఎన్‌పీఆర్‌పై వెనక్కితగ్గిన జగన్మోహన్ రెడ్డి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్‌పీఆర్‌పై ట్వీట్ చేశారు. ఎన్‌పీఆర్‌లో కొన్ని అంశాలను మైనారిటీలను అభద్రతాభావానికి గురిచేస్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్‌పీఆర్‌పై ట్వీట్ చేశారు. ఎన్‌పీఆర్‌లో కొన్ని అంశాలను మైనారిటీలను అభద్రతాభావానికి గురిచేస్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు.

ఎన్‌పీఆర్‌పై పార్టీలో చర్చించామని, అవసరమైన మేరకు కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మైనారిటీల మనోభావాలకు అనుగుణంగా ఎన్‌పీఆర్‌పై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని జగన్మోహన్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతకుముందు ముఖ్యమంత్రి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముస్లిం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌పై వారు తమ ఆందోళనను సీఎంకు తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

Cordon and Search Operation in Nellore: రౌడీలకు మందు బాబులకు చుక్కలే | Police | Asianet News Telugu
రైతులకు పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ చేసిన Minister Anam Ramanarayana Reddy | Asianet News Telugu