కుప్పం : టీడీపీ తరపున బరిలో ఇద్దరు.. ఒకరి అదృశ్యం, చంద్రబాబు పీఏపై అనుమానాలు

By Siva KodatiFirst Published Nov 7, 2021, 4:38 PM IST
Highlights

చిత్తూరు (chittoor) జిల్లా కుప్పంలో (kuppam municipality election) టీడీపీ (tdp) కౌన్సెలర్ అభ్యర్ధి ప్రకాశ్ కుటుంబం అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. అదే వార్డుకు సంబంధించి టీడీపీ అభ్యర్ధిగా వెంకటేశ్ కూడా నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ల పరిశీలన సందర్బంగా వెంకటేశ్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

చిత్తూరు (chittoor) జిల్లా కుప్పంలో (kuppam municipality election) టీడీపీ (tdp) కౌన్సెలర్ అభ్యర్ధి ప్రకాశ్ కుటుంబం అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం 14వ వార్డు కౌన్సెలర్‌గా నామినేషన్ వేశారు ప్రకాశ్. టీడీపీ తరపున రెండవ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అదే వార్డుకు సంబంధించి టీడీపీ అభ్యర్ధిగా వెంకటేశ్ కూడా నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ల పరిశీలన సందర్బంగా వెంకటేశ్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో కుప్పం 14వ వార్డ్ టీడీపీ అభ్యర్ధిగా ప్రకాశ్ బరిలో నిలిచినట్లయ్యింది. 

ఈ క్రమంలో ప్రకాశ్ కుటుంబమంతా కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. తన తమ్ముడు అతని భార్య ఇద్దరు పిల్లలను దౌర్జన్యంగా తీసుకెళ్లారని ప్రకాశ్ అన్న గోవింద రాజులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి (amarnath reddy) , చంద్రబాబు (chandrababu babu) పీఏ మనోహర్‌తో పాటు మరికొందరిపై అనుమానం వుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సొంతపార్టీకి చెందిన అభ్యర్ధి కిడ్నాప్‌కు గురవ్వడం దారుణమంటున్నారు ప్రకాశ్ అన్న గోవిందరాజులు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు (ap local body elections) షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. నవంబర్ 14, 15, 16 తేదీల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని నెల్లూరు కార్పొరేషన్ సహా మున్సిపాలిటీలు, డివిజన్లు, వార్డులతో పాటు జెడ్పీటీసీ, ఎంటీటీసీ స్థానాలకు, పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.  ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం  నోటిఫికేషన్ జారీచేసింది.

Also Read:ఏపీ స్థానిక ఎన్నికలు: చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్.. ఆ రెండు చోట్ల నామినేషన్ల తిరస్కరణ, కోర్టుకెక్కే ఆలోచన

నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు, 533 పంచాయతీ వార్డులు, 69 సర్పంచ్‌ పదవులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే.. 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు, 12 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు ఎన్నిక జరగనుంది. అన్ని ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు.  పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌ జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్‌, 17న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్‌, 18న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. 
 

click me!