బెజవాడ టీడీపీ పంచాయితీ: విజయవాడ నేతలకు అచ్చెన్నాయుడు ఫోన్

Published : Mar 06, 2021, 02:58 PM IST
బెజవాడ టీడీపీ పంచాయితీ:  విజయవాడ నేతలకు అచ్చెన్నాయుడు ఫోన్

సారాంశం

టీడీపీ విజయవాడ నేతలతో  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శనివారం నాడు ఫోన్ లో మాట్లాడారు.

విజయవాడ:  టీడీపీ విజయవాడ నేతలతో  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శనివారం నాడు ఫోన్ లో మాట్లాడారు.

విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆ పార్టీకి చెందిన నేతలు బొండా ఉమ మహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగుల్ మీరాలు  నానిపై సీరియస్ విమర్శలు చేశారు.ఈ విమర్శలపై వ్యాఖ్యానించేందుకు నాని నిరాకరించారు. ఈ పరిణామాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోక్యం చేసుకొన్నారు.

కేశినేని నానిపై విమర్శలు చేసిన  బుద్దా వెంకన్న, బొండా ఉమ మహేశ్వరరావు, నాగుల్ మీరాలతో అచ్చెన్నాయుడు ఫోన్ లో మాట్లాడారు.రేపు విజయవాడలో చంద్రబాబునాయుడు టూర్ సక్సెస్ అయ్యేలా చూడాలని నేతలను అచ్చెన్నాయుడు కోరారు. 

చంద్రబాబు టూర్ లో నాని పాల్గొంటే తాము పాల్గొనబోమని అచ్చెన్నాయుడుకు నేతలు స్పష్టం చేశారు.ఎన్నికల సమయంలో గొడవలు వద్దని  అచ్చెన్నాయుడు. పర్ధిచెప్పారు.కానీ నేతలు మాత్రం ససేమిరా అన్నారు.

చంద్రబాబును హెచ్చరించే ధోరణిలో కేశినేని నాని మాట్లాడడంపై నేతలు తీవ్రంగా స్పందించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే