ఆటలో అరటిపండు: బాలయ్యపై మంత్రి కొడాలి నాని

Published : Mar 06, 2021, 02:47 PM IST
ఆటలో అరటిపండు: బాలయ్యపై మంత్రి కొడాలి నాని

సారాంశం

బాలకృష్ణ ఆటలో అరటిపండు వంటి వాడని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. చంద్రబాబునాయుడు స్క్రిప్ట్ చదవడం తప్ప బాలకృష్ణ చేసేదేమీ లేదన్నారు.

అమరావతి: బాలకృష్ణ ఆటలో అరటిపండు వంటి వాడని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. చంద్రబాబునాయుడు స్క్రిప్ట్ చదవడం తప్ప బాలకృష్ణ చేసేదేమీ లేదన్నారు.

శనివారం నాడు ఆయన  అమరావతిలో మీడియాతో మాట్లాడారు. షూటింగ్ ల కోసం దేశ విదేశాలు తిరిగే బాలకృష్ణకు రాష్ట్ర పరిస్థితులు తెలియవన్నారు. పెద్దిరెడ్డి దెబ్బకు చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందన్నారు. 

స్టీల్ ప్లాంట్ పై మోడీని విమర్శించలేకే జగన్ పై బాబు విమర్శలు గుప్పిస్తున్నారన్నారు.చంద్రబాబు ఓ శనిగ్రహం అని ఎన్టీఆర్ ఏనాడో అన్నారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ నేతలు శని వదిలించుకోవడానికే చంద్రబాబు చుట్టూ  తిరుగుతున్నారన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీకి ఘోర పరాజయం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!