చంద్రబాబు అరెస్ట్‌: 14 మందితో పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన టీడీపీ

By narsimha lode  |  First Published Sep 24, 2023, 4:22 PM IST

చంద్రబాబు అరెస్ట్ తో  రాజకీయ వ్యవహరాలను పర్యవేక్షించేందుకు  14 మందితో  పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది టీడీపీ.


అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  చంద్రబాబునాయుడు అరెస్ట్ తో  14 మందితో పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది టీడీపీ. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆదేశం మేరకు ఈ కమిటీని టీడీపీ ఏర్పాటు  చేసింది.  ఈ కమిటీ వివరాలను టీడీపీ ఏపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  ఆదివారం నాడు ప్రకటించారు.   రాష్ట్రంలో రాజకీయ వ్యవహరాలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.

టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యులు

Latest Videos

undefined

1.యనమల రామకృష్ణుడు
2. అచ్చెన్నాయుడు
3.  చింతకాయల అయ్యన్నపాత్రుడు
4. ఎం.ఏ షరీఫ్
5.పయ్యావుల కేశవ్
6.నందమూరి బాలకృష్ణ
7. నిమ్మల రామానాయుడు
8. నక్కా ఆనంద్ బాబు
9.కాలువ శ్రీనివాసులు
10.కొల్లు రవీంద్ర
11. బీసీ జనార్థన్ రెడ్డి
12. వంగలపూడి అనిత
13.బీద రవిచంద్ర యాదవ్
14.నారా లోకేష్ 

రాష్ట్రంలో  రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా  పార్టీని నడిపించే దిశగా ఈ కమిటీ  కార్యాచరణను సిద్దం చేయనుంది. మరో వైపు  చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ  ఇతర పార్టీలతో కలిసి  ఐక్య పోరాటాలు నిర్వహించే విషయమై చర్చించనున్నారు.

రానున్న రోజుల్లో  టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం, కార్యక్రమాలపై  పొలిటికల్ యాక్షన్ కమిటీ చర్చించనుంది.  జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా  పోరాటాలను కూడ ఈ కమిటీ రూపొందించనుంది.

చంద్రబాబు  అరెస్ట్ విషయంలో  వైఎస్ జగన్  సర్కార్ వ్యవహరించిన తీరును,  ఈ కేసులో ఏం జరిగిందనే విషయాలను  ప్రతి గడపకు తీసుకు వెళ్లాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.మరో వైపు బోగస్ ఓటర్ల తొలగింపు అంశంపై కేంద్రీకరించాలని కూడ ఆ పార్టీ  కేంద్రీకరించింది.ఈ విషయమై ఆ పార్టీ నేతలు బూత్ ల వారీగా  పనిచేస్తున్నారు.  అర్హులైన ఓటర్ల చేర్పింపు,  బోగస్ ఓటర్ల తొలగింపుపై  టీడీపీ నేతలు  క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు. ఎన్ని ఆందోళనలు నిర్వహించినా  ఓటర్ల తొలగింపు విషయమై  ప్రత్యేకంగా  టీడీపీ నేతలు కేంద్రీకరిస్తున్నారు.

click me!