టీడీపీ నూజివీడు అసెంబ్లీ ఇంచార్జీ: పార్థసారథి నియామకం

Published : Feb 20, 2024, 05:00 PM IST
 టీడీపీ నూజివీడు అసెంబ్లీ ఇంచార్జీ:  పార్థసారథి నియామకం

సారాంశం

తెలుగు దేశం పార్టీ  నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా పార్థసారథిని  నియమించింది ఆ పార్టీ.

అమరావతి:  ఏలూరు జిల్లాలోని  నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని తెలుగు దేశం పార్టీ మంగళవారం నాడు నియమించింది. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

also read:చేతిలో చిల్లిగవ్వ లేదు, టీ కోసం డబ్బు సంపాదించారు: నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో

పెనమలూరు అసెంబ్లీ స్థానం నుండి  గత అసెంబ్లీ ఎన్నికల్లో  పార్థసారథి  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా విజయం సాధించాడు. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  పార్థసారథి వైఎస్ఆర్‌సీపీని వీడారు.  పెనమలూరు, నూజివీడు అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి పార్థసారథిని బరిలోకి దింపాలని తెలుగు దేశం పార్టీ భావించింది.ఈ క్రమంలోనే  ఈ రెండు నియోజకవర్గాల్లో  సర్వే నిర్వహించింది.  పెనమలూరులో  పార్థసారథికి టిక్కెట్టు కేటాయిస్తే   సహకరించవద్దని కూడ బోడే ప్రసాద్  వర్గం  గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే  వారం రోజుల  క్రితం  బోడే ప్రసాద్ తో  కొలుసు పార్థసారథి సమావేశమయ్యారు. 

also read:తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం: రెండు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్‌కు

టీడీపీ నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావును ఒప్పించేందుకు తెలుగు దేశం పార్టీ ప్రయత్నించింది.  అయితే  ముద్దరబోయిన  వెంకటేశ్వరరావు  నిన్న సీఎంఓ క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు.  ముద్దరబోయిన  వెంకటేశ్వరరావు  వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు రంగం సిద్దం  చేసుకుంటున్నారు. దీంతో  నూజివీడు  అసెంబ్లీ స్థానానికి ఇంచార్జీగా  మాజీ మంత్రి  కొలుసు పార్థసారథిని తెలుగు దేశం నియమించింది.  ముద్దరబోయిన  వెంకటేశ్వరరావు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా  బరిలోకి దిగనున్నారు.

also read:జయలలిత 27 కిలోల బంగారం వేలం: ఎందుకో తెలుసా?

వైఎస్ఆర్‌సీపీ నుండి  కొందరు నేతలు తెలుగు దేశం పార్టీలో చేరే అవకాశం ఉంది.  మరో వైపు జనసేనతో పొత్తుంది.బీజేపీ కూడ  టీడీపీతో పొత్తుకు జత కలిస్తే  తెలుగు దేశం పార్టీ నేతలు  సీట్లను త్యాగం చేయాల్సి వస్తుంది. ఈ విషయమై చంద్రబాబు నాయుడు  పార్టీ నేతలకు  తేల్చి చెప్పారు.ఈ నెల  22వ తేదీ తర్వాత  పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఉంటుంది.ఈ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తుపై  మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం