
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్త జగన్ ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఇంటిపై దాడి చేయడమే కాకుండా రెండు బైక్‌లకు కూడా నిప్పుపెట్టారు. వైసీపీ శ్రేణుల దాడిలో టీడీపీ కార్యకర్త జగన్‌కు గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్త జయరాం ఇంటిపై దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే ఇరువర్గాలు పరస్పరం దాడులు దిగాయి. దీంతో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు.
అయితే కుప్పంలో చంద్రబాబు, లోకేశ్ దిష్టిబొమ్మల దహనానికి నిరసనగా ఈ నెల 25న టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో చురుగ్గా పాల్గొన్న జగన్‌ను టార్గెట్‌గా చేసుకుని వైసీపీ శ్రేణులు దాడులకు దిగినట్టుగా టీడీపీ ఆరోపిస్తుంది. జగన్ ఇంట్లో వస్తువులను పగులగొట్టారని చెబుతున్నారు. జగన్ కుటుంబ సభ్యులు కూడా గాయపడినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే జగన్‌ను స్థానిక టీడీపీ నేతలు పరామర్శించారు.