
నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకైంది. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వంట నూనె కోసం ఎగబడ్డారు. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ ముందు భాగం ధ్వంసం అయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఆ మార్గంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.