చిత్తూరు జిల్లాలోని కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు పర్యటన నేడు రెండో రోజు కొనసాగనుంది. అయితే చంద్రబాబు టూర్ ను అడ్డుకొంటామని వైసీపీ నేతలు ప్రకటించారు. వైసీపీ తీరును నిరసిస్తూ టీడీపీ కూడా నిరసనలకు పిలుపునిచ్చింది.
చిత్తూరు: జిల్లాలోని కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రామకుప్పం మండలం కొల్లుపల్లిలో నిన్న టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు పార్టీల శ్రేణులు పరస్పరం రాళ్లతో దాడికి దిగారు. కొల్లుపల్లిలో తాము ఏర్పాటు చేసిన పార్టీ జెండాలకు పోటీగా వైసీపీ శ్రేణులు పార్టీ జెండాల కట్టారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన జెండాలను టీడీపీ వర్గీయులు తొలగించారు. అయితే దీనికి వైసీపీ శ్రేణులు అడ్డుపడ్డారు., ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ,తోపులాట చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయించి ఇరు వర్గాల కార్యకర్తలు నిరసనలకు దిగారు.ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలోనే రెండు పార్టీల శ్రేణులు రాళ్లు రువ్వుకున్నాయి.ఈ రాళ్లదాడిలో రెండుపార్టీల క్యాడర్ తో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.
తమ పార్టీ నేత చంద్రబాబు రాకను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పార్టీ జెండాల విషయంలో ఉద్దేశ్యపూర్వకంగా వైసీపీ జెండాలను ఏర్పాటు చేయడంపై టీడీపీ శ్రేణులు విమర్శించాయి. కొల్లుపల్లిలో వైసీపీకి చెందిన నేత ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. వైసీపీ నేత కారును ధ్వంసం చేశారు.
undefined
మూడు రోజుల పర్యటన నిమిత్తం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు నిన్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటనకు వచ్చారు.. ఇవాళ కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు రెండో రోజు పర్యటన కొనసాగించనున్నారు. అయితే రెండో రోజు చంద్రబాబు టూర్ ను అడ్డుకొంటామని వైసీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. టీడీపీ నేతలు కూడా వైసీపీ శ్రేణుల తీరును నిరసిస్తూ నిరసనకు దిగుతామని ప్రకటించాయి. రెండు పార్టీలు కూడా నియోజకవర్గంలో పోటా పోటీ నిరసనలకు పిలుపునిచ్చాయి. టీడీపీ కార్యకర్తలు కుప్పం కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి రావాలని చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత పులివర్తి నాని కోరారు. మరో వైపు చంద్రబాబు టూర్ ను అడ్డుకొనేందుకు వైసీపీ శ్రేణులు కూడా సిద్దమౌతున్నాయి. దీంతో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకన్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. ముందస్తు సమాచారం లేకుండానే ఆర్టీసీ బస్సులను నిలిపవేయడంతో ప్రయాణీకులు ఇబ్బందిపడుతున్నారు.
also read:చంద్రబాబు కుప్పం టూర్ లో ఉద్రిక్తత: టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి
చంద్రబాబు కుప్పంలో పర్యటించకుండా అడ్డుకుంటామని వైసీపీ ప్రకటించారు. చంద్రబాబు టూర్ ను ఎలా అడ్డుకొంటారో చూస్తామని టీడీపీ నేతలు కూడా వైసీపీకి సవాల్ చేశారు.కొల్లుపల్లిలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. తాను రౌడీలకు రౌడీనని చెప్పారు. వైసీపీ రౌడీలకు తాను భయపడబోనని తేల్చి చెప్పారు.
కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి కుప్పం చేరుకున్నారు.పరిస్థితిని ఆయన సమీక్షించారు. ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద భద్రతను సమీక్షించారు. ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కుప్పంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు. కుప్పంలో ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు