ప్రియుడితో భార్య రాసలీలలు: లారీతో ఢీకొట్టి చంపిన భర్త అరెస్ట్

First Published Jun 10, 2018, 1:39 PM IST
Highlights

పిల్లల ముందే ప్రియుడితో రాసలీలలు


విజయనగరం:  వివాహేతర సంబంధం మానుకోవాలని చెప్పినా వినకుండా కొనసాగిస్తున్న భార్యను తానే హతమార్చినట్టుగా తవిటయ్య చెప్పాడు. యుక్తవయస్సు ఉన్న పిల్లలున్నా వారి ముందే భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడాన్ని చూసి తట్టుకోలేక లారీతో ఢీకొట్టి చంపేసినట్టు నిందితుడు ఒప్పుకొన్నాడు.ఈ కేసులో నిందితుడైన తవిటయ్యను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.


రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లా గరివిడి మండం కాపుశంభాం గ్రామానికి చెందిన వివాహిత  రేగాన రమణమ్మను, ఆమె ప్రియుడిని లారీతో తవిటయ్య ఢీకొట్టాడు. ఈ ఘటనలో రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ  ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ శ్యామలరావు వెల్లడించారు.

గరివిడి మండలం కాపుశంభాం గ్రామానికి చెందిన రేగాడ తవిటయ్య లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వృత్తి రీత్యా నెలలో 15 రోజులు అతను ఇంటికి దూరంగా ఉంటారు. తవిటయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వారిద్దరూ కూడ యుక్త వయస్సుకు వచ్చారు.అయితే  ఇంటికి ఎక్కువ రోజులు తవిటయ్య దూరంగా ఉండడంతో అదే గ్రామానికి చెందిన రామకృష్ణతో తవిటయ్య భార్య వివాహేతర సంబంధాన్ని పెట్టుకొంది. వీరిద్దరి వ్యవహరం తెలిసిన తవిటయ్య గ్రామంలో పలుమార్లు పంచాయితీ నిర్వహించాడు. ఆమెను పెద్దలు మందలించారు.


కానీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇంట్లో పిల్లలు, భర్త ఉన్న సమయంలో కూడ ఆమె ప్రియుడు ఇంటికి వచ్చివెళ్ళేవాడు.ఈ విషయమై భార్య,భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అయితే కాలేజీ ఫీజు కోసం తవిటయ్య కూతురు అతడికి ఫోన్ చేసింది. దీంతో ఒడిశాకు వెళ్ళే సమయంలో డబ్బులు ఇంటి వద్ద చెల్లించి వెళ్తానని ఆయన కూతురుకు ఫోన్‌లో చెప్పాడు.

జూన్ 14వ తేదిన సుబద్రాపురం వద్దకు వస్తే డబ్బులిస్తానని భార్యకు తవిటయ్య ఫోన్ చేసి చెప్పాడు. అయితే భర్త నుండి డబ్బులు తీసుకొస్తానని ఇంట్లో చెప్పి వెళ్ళిన తవిటయ్య భార్య నిర్ణీత సమాయానికి సుబద్రాపురం చేరుకోలేదు. కానీ, అక్కడికి చేరుకొన్న తవిటయ్య ఇంటికి ఫోన్ చేస్తే  తల్లి ఉదయమే సుబద్రాపురం వెళ్ళిపోయిందని కూతురు సమాచారం ఇచ్చింది.ఈ విషయమై అనుమానం వచ్చిన తవిటయ్య భార్య ఎక్కడుందో ఆరా తీశాడు. రామకృష్ణతో కలిసి ఆమె చీపురుపల్లిలో ఉందని అతడికి తెలిసింది. 

దీంతో ప్రియుడితో కలిసి ఉన్న భార్య రమణమ్మను పట్టుకొనేందుకు లారీతో సహా తవిటయ్య బయలుదేరాడు. అదే సమయంలో శ్రీకాకుళం రోడ్డులో ప్రియుడితో కలిసి భార్య మోటార్‌బైక్ పై వస్తుండడం తవిటయ్య కంటపడింది.దీంతో ఆగ్రహానికి గురైన తవిటయ్య లారీతో సహా ఆ మోటార్ బైక్ ను ఢీకొట్టాడు. మోటార్‌బైక్ వెనుక కూర్చొన్న  రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. రామకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొలుత రోడ్డు ప్రమాదంగా ఈ ఘటనను పోలీసులు భావించారు. కేసును విచారిస్తే రమణమ్మ వివాహేతర సంబంధం విషయం వెలుగుచూసింది. దీంతో తవిటయ్య స్వగ్రామంలో పోలీసులు విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగుచూశాయి. తవిటయ్య నుండి సేకరించిన వివరాల ఆధారంగా అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 


 

click me!