నాలుగున్నరలక్షల మంది చిన్నారులకు కరోనా సోకే చాన్స్: జగన్ సర్కార్ కు టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదిక

By narsimha lodeFirst Published Jun 8, 2021, 3:47 PM IST
Highlights

కరోనా థర్డ్‌వేవ్‌పై ఏపీ ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్ కమిటీ మంగళవారం నాడు నివేదికను అందించింది.మూడు దశల్లో కరోనాపై టాస్క్‌పోర్స్ కమిటీ ప్రభుత్వానికి 16 పేజీల నివేదికను అందించింది.


అమరావతి:కరోనా థర్డ్‌వేవ్‌పై ఏపీ ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్ కమిటీ మంగళవారం నాడు నివేదికను అందించింది.మూడు దశల్లో కరోనాపై టాస్క్‌పోర్స్ కమిటీ ప్రభుత్వానికి 16 పేజీల నివేదికను అందించింది16 పేజీలతో ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి కమిటీ అందించింది. థర్డ్‌వేవ్‌లో  18 లక్షల మందికి కరోనా సోకవచ్చని కమిటీ అభిప్రాయపడింది. 

సుమారు నాలుగున్నర చిన్నారులు థర్డ్‌వేవ్‌లో కరోనా బారినపడే అవకాశం ఉందని నివేదిక తేల్చి చెప్పింది.కరోనా కారణంగా సుమారు 36 వేల మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరే అవకాశం ఉందిన టాస్క్‌ఫోర్స్ కమిటీ తన నివేదికలో తెలిపింది. ఈ వైరస్ బారినపడి సుమారు 9 వేల మంది ఐసీయూలో చేరే అవకాశం లేకపోలేదు.  ప్రతి రోజూ 553 మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరే అవకాశం ఉందని కమిటీ అంచనా వేసింది. థర్డ్ వేవ్ కరోనా బారినపడే చిన్నారుల కోసం చికిత్స కోసం  మూడు కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.చిన్న పిల్లల కోసం 700 వెంటిలేటర్లను సిద్దం చేసుకోవాలని ప్రభుత్వానికి కమిటీ నివేదికను అందించింది.

click me!